
ఇంటర్నెట్ డెస్క్: నటి జాన్వీకపూర్ ఒక ఇన్‌స్టా పోస్ట్‌కు చేసిన లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: నటి జాన్వీకపూర్ ఒక ఇన్‌స్టా పోస్ట్‌కు చేసిన లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాలో ఓ పేజ్ పెట్టిన రివ్యూను జాన్వీకపూర్ లైక్ చేశారు.
అయితే ఆ రివ్యూలో జాన్వీకపూర్ పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదని రాశారు. ‘పెద్ది: భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్ పెట్టారు. దీన్ని జాన్వీ (Janhvi Kapoor) లైక్ చేయడం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదని జాన్వీ స్వయంగా సమర్థించారని కొందరు అంటుంటే.. పొరపాటున కొట్టి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఈ వార్తలు రావడంతో జాన్వీ ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేశారు. అయితే ఈలోపే దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ ‘అచ్చియమ్మ’ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లలో జోరు చూపినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి రూ.120 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం (Peddi Collections). ఈ వసూళ్లకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.