
Nellore Gold Theft Case: నెల్లూరు నమ్మకంతో ఇంటి తాళాలను బయట దాచడం ఓ కుటుంబానికి కోలుకోలేని భారీ నష్టాన్ని మిగిల్చింది. దొంగలు అదను చూసి తాళం తీసి లోపలికి ప్రవేశించి, బీరువాలో దాచి ఉంచిన సుమారు 210 గ్రాముల (21 తులాల) బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన సంచలన ఘటన నెల్లూరు నగరంలోని కుమ్మరి వీధిలో చోటుచేసుకుంది. Read Also: Nellore Crime News:యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్! నగరంలోని స్థానిక కుమ్మరి వీధికి చెందిన షఫీ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా ప్రతిరోజూ సాయంత్రం పిల్లలను ట్యూషన్‌కు తీసుకెళ్లే సమయంలో ఇంటి తాళాలను బయట ఉన్న వాషింగ్ మెషీన్ కవర్ లోపల దాచి ఉంచడం షఫీ భార్యకు అలవాటు. ఇదే అలవాటును కొనసాగిస్తూ, సంఘటన జరిగిన రోజు కూడా తాళాలను ఎప్పటిలాగే వాషింగ్ మెషీన్ కవర్లో ఉంచి కుటుంబ సభ్యులంతా కలిసి బయటకు వెళ్లారు. పిల్లలను ట్యూషన్ నుండి తీసుకుని తిరిగి ఇంటికి వచ్చిన షఫీ భార్యకు తలుపులు తెరిచి ఉండటం చూసి ఒక్కసారిగా గుండె గుభేలుమంది. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లో ఉన్న బీరువా తలుపులు పూర్తిగా తెరిచి ఉన్నాయి. ఆందోళనతో లోపల వెతకగా, దాచి ఉంచిన సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దుండగులు ఇంటి బయట దాచిన తాళాన్ని కనిపెట్టి, దాంతోనే తలుపులు తీసి లోపలికి ప్రవేశించారని.. ఆపై ఎవరూ లేని సమయం చూసి బీరువాను పగలగొట్టి నగలన్నింటినీ దోచుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ భారీ చోరీ ఘటనపై సమాచారం అందుకున్న చిన్నబజార్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీమ్ (Clues Team) రంగంలోకి దిగింది.
news: రోడ్డు ప్రమాదంలో సిమ్స్ హాస్పిటల్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ మృతి
Nellore Bus accident: నెల్లూరు హైవేపై ఘోర ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు!
Nellore boat accident: నెల్లూరులో నాటు పడవ బోల్తా.. నలుగురు గల్లంతు
Srisailam Temple: శ్రీశైలంలో భ్రమరాంబ దేవి అమ్మవారికి బంగారు హారం సమర్పణ.