
ఇంటర్నెట్డెస్క్: థియేటర్లో వచ్చిన సంగతి తెలియకుండా కొన్ని చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా అలా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన మూవీ ‘అగ్లీ స్టోరీ’. నందు (Nandu), అవికా గోర్ (Avikagor), రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అగ్లీ స్టోరీ’ (Ugly Story). ప్రణవ స్వరూప్ దర్శకుడు. రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. జూన్ 5వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన నేహా (అవికా గోర్)ను మేనమావ (శివాజీ రాజా) సొంత కూతురిలా పెంచుతాడు. వరుసకు మరదలైన నేహాపై మావయ్య కొడుకు కార్తిక్ (నందు) ప్రేమ పెంచుకుంటాడు. ఎంతలా అంటే, నేహ వేరే వారితో మాట్లాడినా, నవ్వినా భరించలేని మనస్తత్వం. అయితే నేహాకు చిన్నతనం నుంచి తన క్లాస్మేట్, మిత్రుడైన గౌతమ్ (రవితేజ మహాదాస్యం) అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఆ విషయం తెలిసి కార్తీక్ సైకోలా మారతాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోకార్తిక్ను పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా నేహాను కార్తిక్ హింస పెడుతూనే ఉంటాడు. ఒకరోజు నేహా అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? నేహా ఎక్కడికి వెళ్ళింది? ఈ కేసు పోలీస్ స్టేషన్కు వెళ్ళాక ఎలాంటి మలుపులు తిరిగింది? చివరకు సైకో కార్తిక్ ఏమయ్యాడు? అనేదే ఈ ‘అగ్లీ స్టోరీ’ కథ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.