
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే అఫ్గానిస్థాన్‌తో టీమ్ఇండియా ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. శనివారం నుంచి ఏకైక టెస్టు ప్రారంభం కానుంది. శుభమన్ గిల్ నాయకత్వంలోని భారత ఆటగాళ్లు ఇప్పటికే ముల్లాన్‌పుర్ చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అవకాశం కల్పించారు. కానీ, గాయం కారణంగా విరాట్ సిరీస్‌కు దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. రోహిత్ కూడా ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో భారత బౌలింగ్ కోచ్ టెన్ డస్కటే అప్డేట్ ఇచ్చాడు.
‘‘బయట ఏం చర్చ జరిగినా అనవసరం. అధికారికంగా మేం త్వరలోనే సమాచారం ఇస్తాం. విరాట్ లేదా రోహిత్ వంటి పెద్ద ఆటగాళ్లు సిరీస్‌లో ఆడకపోవడం బిగ్ న్యూస్ అవుతుందని తెలుసు. ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రోటోకాల్స్ అందరికీ ఒకేలా ఉంటాయి. సిరీస్ ప్రారంభానికి కొద్ది సమయం ఉంది. ఆలోగా మేం నిర్ణయం తీసుకుంటాం. ఫిట్‌గా ఉంటే తుది జట్టులో ఉంటారు. లేకపోతే అందుకు తగినట్టుగా మార్పులు చేసుకుంటాం. వైద్య బృందం ఖరారు చేసిన అనంతరం పరిస్థితి ఏంటో అధికారికంగా వెల్లడిస్తాం’’ అని డస్కటే తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.