
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Illegal Gutka Sale Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యాసంస్థల పరిసరాలు మత్తు పదార్థాల కేంద్రాలుగా మారుతున్నాయి.. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన స్కూళ్లతో పాటు కాలేజీల సమీపంలోనే ప్రమాదకరమైన గుట్కా ప్యాకెట్లతో పాటు సిగరెట్ల విక్రయాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కోట్పా (COTPA) చట్టం ప్రకారం.. విద్యాసంస్థలకు 100 మీటర్ల లోపు ఎలాంటి పొగాకు ఉత్పత్తులతో పాటు ఇతర మత్తు పదార్థాలను విక్రయించకూడదనేది స్పష్టమైన నిషేధం ఉన్నప్పటికీ.. ఇక్కడ వ్యాపారులు ఆ నిబంధనలను తుడిచి పెడుతున్నారు.. కిరాణా దుకాణాలతో పాటు పాండబ్బాలు, చిరుదిండ్ల బండ్ల ముసుగులో మైనర్ విద్యార్థులకు సైతం బహిరంగంగానే సిగిరెట్ల విక్రయిస్తూ వస్తున్నారు. నిషేధిత గుట్కాలను విక్రయిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
ఈ విచ్చలవిడి అమ్మకాల వెనక కేవలం పొగాకు ఉత్పత్తులే కాకుండా.. అంతకుమించి పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.. సిగరెట్ల తో పాటు గుట్కా విక్రయాల ముసుగులో విద్యార్థులకు గంజాయితోపాటు ఇతర ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో దొరికే మత్తు పదార్థాలకు అలవాటు పడి.. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు..
పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలో పోలీసులు విద్యాసంస్థల సమీపంలో ఉన్న ప్రతి షాపుపై ప్రత్యేకమైన నిఘా ఉంచి.. ఆకస్మిక తనిఖీలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటుండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం అలాంటి ముందస్తు చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కేవలం మీద మీదనే తనిఖీలు చేసి వదిలేస్తున్నారే తప్ప.. శాశ్వత నియంత్రణపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు సైతం మండిపడుతూ వస్తున్నారట..
కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.. అన్ని పాఠశాలలు, శాలల పరిసర ప్రాంతాలను ఖచ్చితమైన టొబాకో ఫ్రీ జోన్లుగా ప్రకటించడమే కాకుండా.. నిబంధనలు ఉల్లంఘించి దుకాణదారులపై పీడియాక్ టువంటి కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. పోలీసులతోపాటు విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.