
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం మంత్రులతో చర్చిస్తున్నారు. అమరావతి, జూన్4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈరోజు (గురువారం) ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం.. మంత్రులతో చర్చిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడుతున్నారు. అయితే, ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి (Pawan Kalyan) వెన్నునొప్పి తీవ్రంగా ఉండటంతో బయటకు వచ్చేశారు. ఈ మేరకు సీఎంకి, మంత్రివర్గ సభ్యులకు సమాచారం ఇచ్చి మధ్యలోనే డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. అనంతరం ఆయన మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా, హైకోర్టు భవనాల దగ్గర మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్ RFCకి ఆమోదించనుంది. పీపీపీ ప్రాతిపదికన డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో.. అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం కల్పించనుంది. జెయింట్ అబ్జర్వేషన్ వీల్‌ను నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తల్లికి వందనం పథకానికి నిధుల విడుదలపై మంత్రి మండలి చర్చించనుంది. ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి
Read Latest AP News And Telangana News And National News