US Husband Excavator Demolition : కుటుంబ కలహాలు, విడాకుల వివాదాలు మనిషిని ఎంతటి నిరుత్సాహానికి గురిచేస్తాయో, జీవితంపై ఆశ కోల్పోయేలా చేస్తాయో మన అందరికీ తెలిసిందే. చాలా మంది ప్రేమించిన భార్య విడాకులు ఇస్తే.. ఆమెను వదిలి ఉండలేక, మర్చిపోలేక తెగ ఇబ్బంది పడిపోతుంటారు.
దాన్నుంచి బయటపడడానికి చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన భార్య తనకు విడాకులు ఇస్తానని చెప్పడంతో.. ఎవరూ ఊహించని ఓ పని చేశాడు. ఏకంగా జేసీబీని వేసుకు వచ్చి ఇంటిని కూల్చేశాడు. అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే..
అతడు ఇల్లు కూల్చుతున్న సమయంలో అతని భార్య, ఇద్దరు కుమార్తెలు ఆ ఇంటి లోపలే ఉన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
"నువ్వు వద్దంటే.. ఇల్లు కూడా వద్దు"పెన్సిల్వేనియాకు చెందిన 48 ఏళ్ల ఎరిక్ పియెర్వ్స్జాకు, అతని భార్యకు మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మే 26వ తేదీన భార్య అతనితో.. "నాకు నీతో కలిసి జీవించడం ఇష్టం లేదు.. మనం విడాకులు తీసుకుందాం" అని స్పష్టం చేసింది.
ఈ మాట వినగానే ఎరిక్కు విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. "మన బంధం ముగిసిపోతే.. ఇక ఈ ఇల్లు కూడా ఉండటానికి వీళ్లేదు. వెంటనే దీన్ని నేను కూల్చేస్తాను" అంటూ భార్యను హెచ్చరించాడు.ఇంట్లో భార్యాపిల్లలు.. జేసీబీతో కూల్చబోయిన భర్త!
హెచ్చరించిన కొద్ది నిమిషాల్లోనే ఎరిక్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. బయట ఉన్న ఒక భారీ జేసీబీ యంత్రంలోకి ఎక్కి, తన సొంత నివాస గృహాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతని భార్య, భయాందోళనలతో వణికిపోతున్న ఇద్దరు కుమార్తెలు ఇంట్లోనే చిక్కుకుపోయారు.
.