
Nellore Palle Veekshana Programme: నెల్లూరు జిల్లాలో వినూత్నంగా నిర్వహిస్తున్న పల్లె వీక్షణ కార్యక్రమంలో ప్రజల అందిస్తున్న అర్జీలను 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టామని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.శుక్రవారం కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. కుల్లూరు పంచాయతీ పరిధిలోని రాజుపాలెం వద్ద ఉపాధి హామీ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. సమీపంలో ఉన్న మామిడి తోటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కుల్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. మంచినీటి నాణ్యతను పరిశీలించారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. Read also: YS Jagan: డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి పలు అర్జీలు స్వీకరించారు. అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు తెలిపిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా ఆలకించిన కలెక్టర్, ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మీడియాతో మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నూటికి నూరు శాతం సమర్థవంతంగా అమలు చేస్తూ అర్హులందరికీ అందేలా పర్యవేక్షించడమే “పల్లె వీక్షణ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయిని స్వయంగా తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే చక్కదిద్దేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ గ్రామంలో రైతులు ప్రధానంగా రెవెన్యూ భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, దొంగ పట్టాలు సృష్టించడం, ఎస్సీ ఎస్టీల భూములను ఆక్రమించడం, రీ సర్వే సమస్యలపై
ఎక్కువగా ప్రజలు అర్జీలు అందించారని కలెక్టర్ వివరించారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల పరిధిలో పల్లె వీక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను నెల రోజుల్లో పై పరిష్కరించేలా చర్యలు చేపట్టామని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేస్తున్నామని చెప్పారు.
ప్రధానంగా ఈ కార్యక్రమంలో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటుచేసి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. భూ అక్రమాలకు పాల్పడినా, దొంగ పట్టాలు సృష్టించి నిజమైన లబ్ధిదారులు మోసం చేసినా అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. రాజుపాలెం గ్రామంలో ఒక ఛాంపియన్ ఫార్మర్ ఇతర రైతులకు ఆదర్శంగా కవర్ మ్యాంగో ప్రయోగం చేసి మంచి దిగుబడి లాభాలు సాధించాడని, ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది రైతులు ఈ విధానాన్ని ఆచరించాలని కలెక్టర్ సూచించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించే సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కుల్లూరు పంచాయతీ పరిధిలో గత రెండేళ్లలో రూ.6.80 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచనతో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. తన నియోజకవర్గ పరిధిలో మూడు మండలాల్లో పల్లె వీక్షణ కార్యక్రమం చాలా బాగా జరిగిందని, ఇదేవిధంగా తిరుపతి జిల్లా పరిధిలోని తన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా అక్కడి కలెక్టర్ ను కూడా కోరనున్నట్లు చెప్పారు.
అనంతరం కలువాయి మండలంలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఉన్నతి పథకం ద్వారా రుణాలను అందజేశారు. వికలాంగులకు నివేశ స్థల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ మహబూబ్ బాషా, ఆర్డీఓ పావని , జడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి, డీపీఓ వసుమతి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, డీఎం అండ్ హెచ్‌వో సుజాత, ఇరిగేషన్, విద్యుత్ శాఖ ఎస్ఈలు దేశ్ నాయక్,రాఘవేంద్రన్, వివిధ శాఖల అధికారులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు
Thopaji Ananth Kishan Congress:కాంగ్రెస్ గెలుపే లక్ష్యం!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Nellore district news: రోడ్డు ప్రమాదంలో సిమ్స్ హాస్పిటల్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ మృతి
Nellore Bus accident: నెల్లూరు హైవేపై ఘోర ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు!
Nellore boat accident: నెల్లూరులో నాటు పడవ బోల్తా.. నలుగురు గల్లంతు
Srisailam Temple: శ్రీశైలంలో భ్రమరాంబ దేవి అమ్మవారికి బంగారు హారం సమర్పణ.
Kovur Padugupadu Bus Accident: కోవూరు వద్ద ఘోర ప్రమాదం..జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!
Nellore News: పరిశ్రమల హబ్ గా కోవూరు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
వైసిపి నాయకులకు కేవలం సమస్యలు సృష్టించడం, ప్రభుత్వంపై బురదజల్లడమే అలవాటుగా మారిందని, వారికి సమాధానాలు వినే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల...
ఇటీవల అమరావతి వేదికగా తెలుగు రాష్ట్రాల సామాజిక పరిస్థితులపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంపై...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు....
భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన శైలి యోగా అని, దానిని ఒక ప్రజా ఉద్యమంగా...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాకపై భారత వాతావరణ శాఖ...
తెలంగాణ రాష్ట్రం, దక్షిణాఫ్రికాల మధ్య ఆర్థిక, వాణిజ్య బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా బుధవారం...
Medak Inter Thieves Arrest; మెదక్ ల్లో గత కొంతకాలంగా వివిధ జిల్లాల్లో వరుస దోపిడీలతో...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.