మేష రాశి వారికి ఈరోజు తాము చేసే పనుల్లో సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరగొచ్చు. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవ్వొచ్చు. మీ ఆచరణాత్మ ఆలోచన, ప్రణాళికల వల్ల అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. కుజుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. కర్మ స్థానంలో చంద్రుడి సంచారం కారణంగా ఉద్యోగులకు శుభవార్తలు వినిపించొచ్చు. వృషభ రాశి నుంచి చంద్రుడు అష్టమ స్థానంలో ఉండటం కారణంగా అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు పొందొచ్చు. మీ కోరికలలో ఒకటి ఈరోజు నెరవేరొచ్చు. దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీరు వ్యాపారానికి సంబంధించి ఏదైనా సలహా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, ఆ సలహా అనుభవం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. చంద్రుడు అష్టమ స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా కొన్ని సవాళ్లు ఎదురవ్వొచ్చు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరోవైపు బుధుడు, శుక్రుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుంచి రెండో స్థానంలో గురు గ్రహం ప్రభావంతో ఆర్థిక పరంగా కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు గురు, చంద్ర గ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. బంధువుల తరపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. శుక్ర, గురు గ్రహాల ప్రభావంతో విద్యార్థులు మెరుగైన ప్రయోజనాలు పొందొచ్చు.
నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.
సింహ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఈ రాశి నుంచి ఆరో స్థానంలో చంద్రుడు, లగ్న స్థానంలో కేతువు ఉండటం వల్ల మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఏర్పడొచ్చు. మీరు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈరోజు సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సమన్వయం పాటించాల్సి ఉంటుంది. ప్రతికూల గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ప్రభావాలను తగ్గించుకోవడానికి గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.
కన్య రాశి వారికి ఈరోజు పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి ప్రభావంతో శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. వినోదభరితమైన లేదా పుణ్యయాత్రకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. కర్మ స్థానంలో ఉన్న బుధ, శుక్ర గ్రహాలు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. మీ తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి.
తులా రాశి నుంచి చంద్రుడు ఈరోజు ఆరో స్థానంలో సంచారం చేయడం కారణంగా కొన్ని శుభవార్తలను వింటారు. శుక్రుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవ్వొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. ఈరోజు మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక రంగంపై మీకు ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారు ఈరోజు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీ శక్తి, సామర్థ్యాలు పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. ఉద్యోగులు సహోద్యోగులతో సరదాగా గడపగలరు. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఏదైనా ఆస్తి వివాదం కొనసాగుతుంటే, మీరు అనుభవం ఉన్న వ్యక్తుల సాయంతో దానిని పరిష్కరించుకోగలరు. ఈరోజు గాయత్రీ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు రావొచ్చు.
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు పొదుపుకు సంబంధించిన పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. మరోవైపు ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకండి. ఈ రాశి నుంచి అష్టమ స్థానంలో గురు సంచారం జరిగే సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఇదే రాశిలో చంద్రుడి సంచారం కారణంగా మీ మనసులో కొంత ప్రతికూలంగా ఉండొచ్చు. ఉద్యోగులు ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే అవకాశాలున్నాయి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు. మీకు ప్రయోజనకరంగా ఉండే కొన్ని ఊహించని వనరులు కూడా లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. దీంతో మీరు చాలా సంతోషిస్తారు.
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు నష్టపోవచ్చు. స్టాక్ మార్కెట్ వంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులు మీకు కొన్ని ఇబ్బందులు కలిగించొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి వారు ఈరోజు శుభప్రదమైన ఫలితాలు పొందొచ్చు. మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఏదైనా కొత్త విషయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పెట్టుబడి రెండింతలు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళొచ్చు. మీ పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు పొందొచ్చు. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి