
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP DSC 2025 Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో 2025లో భర్తీ చేసిన టీచర్ ఉద్యోగాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మేం అధికారంలోకి వచ్చాక తాము విచారణ చేస్తామని ప్రకటించారు. 'డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలు కనిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా జీఓలు ఇవ్వడంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలతో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయ పోరాటం చేస్తాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 'దీనికోసం లీగల్ ప్యానెల్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అన్యాయం జరిగిన డీఎస్సీ అభ్యర్థులు బాధపడొద్దు. ఏ మాత్రం ధైర్యం కోల్పోవద్దు. ఓపిగ్గా ఉండాలి. వారికి ప్రతి అడుగులో అండగా.. తోడుగా ఉంటాం' అని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. Also Red: Fuel Prices Decrease: కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుదల? తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు డీఎస్సీ-2025 అభ్యర్థులు మాజీ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమై డీఎస్సీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో చోటుచేసుకున్న అనేక అక్రమాలపై మాజీ సీఎం జగన్‌కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ అధినేతకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్గన్ మాట్లాడుతూ.. '1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి అన్నింటిలో సక్సెస్ అయిన అనేక మంది
డీఎస్సీ-2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు' అని తెలిపారు.
ఇష్టారాజ్యంగా జీఓలు జారీ చేసి.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దీంతో ఎందరో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. వారి తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. దీనికోసం లీగల్ ప్యానెల్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని, అన్యాయానికి గురైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు ఇస్తామని భరోసా ఇచ్చారు.
Also Read: Telangana Rains: వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. తెలంగాణలోని 18 జిల్లాల్లో భారీ వర్షాలు
తాము ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే.. 2019లో గాంధీ జయంతి వరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చరమేస్తోందని చెప్పారు. 'డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీఓ ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వారు ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీఓ జారీ చేసి, ఆ కోటాలో కూడా అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి చేయగానే, మళ్లీ నియమావళి మారుస్తూ మరో జీఓ ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.
డీఎస్సీ 2025పై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అక్రమాలపై విచారణ జరిపిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. కొంచెం ఓపిక పట్టాలని సూచించారు. 'ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి.. వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని చేయగానే గేట్లు మూసి మరో జీఓ ఇచ్చారు. ఇంత కంటే దగా, మోసం మరోటి ఉంటుందా?' అని ప్రశ్నించారు. 'జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.