
సినిమా హీరోలు భార్యలకు విడాకులు ఇవ్వడం చాలా కామనే. అలాగే రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు చాలామందే ఉన్నారు భారతీయ చిత్ర రంగంలో. మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి అమీర్ ఖాన్ (Aamir Khan) చేరబోతున్నారు. 61 ఏళ్ల అమీర్ ఖాన్ మూడోసారి వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్ మీడియా వార్తలు. కొంతకాలంగా అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) అనే ఆమెతో చక్కర్లు కొడుతున్నారు. ఆమెని మీడియాకి కూడా పరిచయం చేశారు. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆమెతో జూలై 5న ఆమిర్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్. బాలీవుడ్ లో అగ్ర హీరోల స్థాయికి చేరుకున్న అమీర్ ఖాన్ మొదట రీనా దత్తాని 1986లో పెళ్లాడారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు పెళ్లి అయింది. కొడుకు మొన్నే హీరోగా “ఏక్ దిన్” అనే సినిమా చేశాడు. సాయి పల్లవి నటించిన ఆ చిత్రం ఆడలేదు. ఇక తనతో కలిసి వర్క్ చేసిన దర్శకురాలు, నిర్మాత కిరణ్ రావుని 2002లో రెండో పెళ్లి చేసుకున్నారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, కిరణ్ కి ఒక బాబు. 2021లో కిరణ్ రావుకి విడాకులు ఇచ్చాడు అమీర్ ఖాన్. రెండేళ్లుగా గౌరీ స్ప్రాట్ తో ప్రేమలో ఉన్నాడు అమీర్ ఖాన్. 60లో కూడా ఇంకా తాను ఇరవై అన్నట్లుగా ప్రేమలో పడడమే కాకుండా పెళ్లి చేసుకోబుతున్నారు
.