
Unemployment : దేశంలో ఉద్యోగ నియామకాల చుట్టూ పెరుగుతున్న అసంతృప్తి కేవలం నిరుద్యోగ సమస్యకు సంబంధిం చినది మాత్రమే కాదు. ఇది నియామక వ్యవస్థపై యువత లో పెరుగుతున్న నమ్మక సంక్షోభానికి ప్రతిబింబం. ఒకవైపు ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నిరు ద్యోగం తగ్గుతోందని గణాంకాలు చెబుతుండగా, మరోవైపు నేలమీద యువత అనుభవం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోం ది.
నియామకాల ఆలస్యాలు, పారదర్శకత లోపం, పేపర్ లీకులు, కోర్టు వివాదాలు, సమాచార అస్పష్టత, ఫలితాలపై అనుమానాలు వంటి అంశాలు యువతలో తీవ్రమైన అనిశ్చి తిని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం అందరినీ సమానంగా ప్రభావితం చేయడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నూ, పట్టణ పేదలలోనూ మొదటి తరంలో విద్యావకాశాలు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ దళితబహుజన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఉపాధి అవకాశాలు మాత్రమే కావు, అవి సామాజిక భద్రత, గౌరవం, కుటుంబ ఆర్థిక స్థిర త్వం, తరతరాల వెనుకబాటుతనాన్ని అధిగమించే మార్గం కూడా.
అందువల్ల నియామక వ్యవస్థలో ఏర్పడుతున్న అవకతవకలు, ఆలస్యాలు, అపారదర్శక విధానాలు వీరిపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. లక్షలాది రూపాయలు అప్పులు చేసి, హైదరాబాద్‌లో కొన్నిప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో సంవత్సరాల తరబడి జీవిస్తూ పరీక్షలకు సిద్ధమవు తున్న యువత పరిస్థితి ఈ సంక్షోభ తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
కుటుంబాల ఆశలు, అప్పులు, భవిష్యత్తు అన్నిం టినీ భుజకాలపై మోస్తూ చదువుతున్న యువతకు చివరికి ఎదురవుతున్నవి వాయిదాలు, రద్దయిన పరీక్షలు, కోర్టు కేసులు, అనిశ్చితి. ఒక విద్యార్థి కష్టపడి చదివితే ఉద్యోగం సాధించగలడనే పాథమిక సామాజిక నమ్మకాన్నే నియామక వ్యవస్థలోని అవ్యవస్థ దెబ్బతీస్తోంది.
Read Also : H1B Visa Applications : ఫీజులు భారీగా పెంచినా తగ్గని H-1B క్రేజ్.. లక్షల్లో దరఖాస్తులు దేశంలో నిరుద్యోగ పరిస్థితిపై అధికారిక గణాంకాలు కొంత మెరుగుదల కనిపి స్తున్నాయని చెబుతున్నాయి.
కోలుకోలేని నష్టంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్ రంగంలో స్థిరపడలేకపోవడంవల్ల అనేక మంది తీవ్ర మాన సిక ఒత్తిడికి గురవుతున్నారు. యువత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల వైపు రావడాన్ని కొంత సామాజిక ఆధి పత్య వర్గాలు అసహనంతో చూడటం కూడా కనిపిస్తోంది. నియామక వ్యవస్థలో ఏర్పడుతున్న అనుమానాలు, వివా దాలు ఈ అసమాన సామాజిక నిర్మాణంతో సంబంధం లేకుండా చూడలేం. మన దేశ సామాజిక వ్యవస్థలో అణ గారిన వర్గాలకు విద్య, అధికార, రాజ్యపాలన హక్కులను నిరాకరించిన మనుధర్మ ఆధారిత సామాజిక నిర్మాణం చారిత్రకంగా పనిచేసింది. ‘విద్య’, ‘అధికార’, ‘రాజ్యపాలన’ కొన్ని వర్గాలకే పరిమితమవ్వాలని భావించిన ఆ సామాజిక దృక్పథం ఆధునిక రాజ్యాంగ విలువలకు విరుద్ధం. రాజ్యాం గం సమాన అవకాశాల దిశగా మార్గం చూపించినప్పటికీ, నియామక వ్యవస్థలో కనిపిస్తున్న అసమానతలు ఇంకా సామాజిక న్యాయం పూర్తిగా సాధ్యపడలేదనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే అది కేవలం ఉద్యోగ సమస్యగా మిగలదు. ప్రజాస్వామ్యంపై నమ్మక సంక్షోభంగా మారుతుంది.
Mahabubnagar Congress meeting arrangements: ఈనెల 5న పాలమూరుకుసీఎం రేవంత్ రెడ్డి
Borancha news: బోరంచలో రూ. 95 లక్షలతో కొత్త నీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభం!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Trinamool Party: ‘మమతా బెనర్జీ మా నాయకురాలు’ అంటూ తృణమూల్ మద్దతు
SC Online Gaming Ban:ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ ఆటలకు రాజ్యాంగ రక్షణ లేదు!
mangoes : ఫలరాజుల దిగుబడికి ‘కాపు’ కాసేదెవరు?
YS Jagan: ఢిల్లీ అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి!
Nepal’s Lamichhane: నేపాల్ నేత లమిచానేకు ఢిల్లీలో బీజేపీ ఘన స్వాగతం
Petrol demand: తగ్గిన గ్యాస్ వాడకం.. పెరిగిన పెట్రోల్ యూజింగ్
ప్రకాశం జిల్లా ఒంగోలు శివార్లలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం, ఊహించని విధంగా భారీ ఎత్తున...
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో...
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో...
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతోంది. ఈ కాలం జూన్ 22 వరకు...
తెలంగాణ వేదికగా జనసేన పార్టీ సభ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదం, విమర్శలు...
ఎల్‌నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ...
భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి మారుతి సుజుకి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే అత్యధిక కార్లను...
హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్...
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)...
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం చల్లబడనుంది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.