
CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బోర్డు ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, బోర్డు సెక్రటరీ హిమాన్షు గుప్తాలను తక్షణమే బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 12వ తరగతి పరీక్షల ఫలితాల డిజిటల్ మూల్యాంకనంలో వెలుగుచూసిన తీవ్ర లోపాలు, అలాగే బోర్డుకు చెందిన రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి జరగడం వంటి వరుస వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. read also: TVK Vijay : పూజ గదిలో విజయ్ బొమ్మకు పూజలు..ఫ్యాన్స్ ఫిదా !! ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సరికొత్త ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) లేదా డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో అనేక సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి. ఆన్లైన్ స్క్రీన్‌పై జవాబు పత్రాలు సరిగ్గా కనిపించకపోవడం, కొన్ని ముఖ్యమైన పేజీలు మాయమవడం, కొన్ని ప్రశ్నలను దిద్దకుండానే వదిలేయడం, చివరకు ఒకరి ఆన్సర్ షీట్‌కు మరొకరి మార్కులను కేటాయించడం వంటి తీవ్రమైన నిర్లక్ష్యాలు ఈ విధానంలో బయటపడ్డాయి. ఈ సమస్యలన్నింటికీ తోడు, జూన్ 2వ తేదీన ప్రారంభమైన విద్యార్థుల రీ-ఎవాల్యుయేషన్ (పునఃసమీక్ష) పోర్టల్‌పై ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గుర్తుతెలియని వ్యక్తులు భారీ సైబర్ దాడికి తెగబడ్డారు. వెబ్‌సైట్‌ను స్తంభింపజేసే లక్ష్యంతో దాదాపు 15 లక్షల హిట్స్‌తో ‘డినైయల్-ఆఫ్-సర్వీస్’ (DoS) దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా, ఒకేసారి లక్షకు పైగా నకిలీ లాగిన్ ప్రయత్నాలు జరిగినట్లు సాంకేతిక నిపుణులు గుర్తించడంతో బోర్డు భద్రతా వైఫల్యాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వివాదాస్పదంగా మారిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) సేవల ఎంపిక, దాని అమలు తీరును పరిశీలించడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్. రాధా చౌహాన్ నేతృత్వంలో ఒక
ఏకసభ్య విచారణ కమిటీని నియమించింది. ప్రస్తుత సాంకేతిక సమస్యల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము పూర్తిగా పరిష్కరిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలతో పాటు అవసరమైన అన్ని దిద్దుబాటు చర్యలను తక్షణమే చేపడతామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టమైన హామీ ఇచ్చారు.
Today Gold Rate : పసిడి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
TVK Vijay : పూజ గదిలో విజయ్ బొమ్మకు పూజలు..ఫ్యాన్స్ ఫిదా !!
DK Shivakumar Swearing : కర్ణాటక సీఎంగా నేడు డీకే ప్రమాణస్వీకారం
Private School Fees : ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై విజయ్ కీలక నిర్ణయం
Keralam : పిల్లలకు హారతులతో స్వాగతం పలికిన టీచర్లు
Mamata Banerjee : మమతకు భారీ షాక్?.. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్!
భారత్‌లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం అదనంగా ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర...
వేలేరుపాడు మండలంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.స్థానికంగా జరిగిన విషాదకర...
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ...
రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై శరపరంపరగా ప్రశ్నలు కురిపించారు. తెలంగాణ (TG)...
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్...
తెలంగాణలోని సినీ ప్రేక్షకులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ బిగ్గెస్ట్...
విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు,...
తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ...
మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఉద్యమకారులు, యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరవీరులయ్యారని,...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.