
సమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఒకప్పుడు అత్యంత బిజీ హీరోయిన్గా రాణించింది. తెలుగులో దాదాపు అందరు స్టార్లతో కలిసి నటించింది. వరుసగా విజయాలు అందుకుంది. అత్యంత క్రేజీ హీరోయిన్ అయిన సమంత ఇప్పుడు కొంత గ్యాప్‌తో వస్తోంది. ప్రస్తుతం ఆమె `మా ఇంటి బంగారం` చిత్రంలో నటించింది.
నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు కథ, మాటలు అందించడం విశేషం. అంతేకాదు ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్నిడిమోరు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల(జూన్) 19న విడుదల కాబోతుంది.
మరో రెండు వారాల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఎందుకు చూడాలనేదానికి ఐదు కారణాలు తెలుసుకుందాం. `మా ఇంటి బంగారం` సినిమా చూడ్డానికి మొదటి ప్రధాన కారణం.. మూడేళ్ల తర్వాత సమంత నటించిన చిత్రమిది. ఆమె చివరగా `ఖుషి` చిత్రంతో మెరిసింది.
2023లో ఇది రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఏడాది బ్రేక్ ప్రకటించింది. కానీ మూడేళ్లు వచ్చింది. మయోసైటిస్ అనే వ్యాధిని ఎదుర్కొని సినిమాలు చేసే క్రమంలో.. తన తండ్రి చనిపోయాడు. దీంతో మరింతగా కుంగిపోయింది సమంత.
దాన్ని తట్టుకుని, అనేక అడ్డంకులను దాటుకుని ఈ మూవీ చేసింది సామ్. మూడేళ్ల తర్వాత థియేట్రికల్ రిలీజ్‌తో వస్తోన్న సమంత కోసం ఈ మూవీని చూడొచ్చు. ఈ సినిమా చూడ్డానికి రెండో కారణం.. సమంతనే నిర్మాత. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మించింది.
ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ని స్థాపించి మొదటగా చిన్న బడ్జెట్‌తో `శుభం` చిత్రాన్ని నిర్మించింది సమంత. సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఈ మూవీ చేసింది. పెళ్లి తర్వాత సమంత నుంచి రిలీజ్ అవుతున్న సినిమా కావడం, భర్తతో కలిసి నిర్మించిన సినిమా కావడం ఓ విశేషమైతే, దీనికి కథ, స్క్రీన్‌ప్లే రాజ్ నిడిమోరు అంది
.