
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొంది
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే కీలక నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది.
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు విడుదల ముందు రోజు కాదు కదా కొన్ని గంటల ముందు వరకూ బుకింగ్స్ ఓపెన్ కాక, అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇందుకు అనేక అంశాలు కారణమైనా, అంతిమంగా టికెట్లు బుక్ కావడమే ప్రేక్షకుడు చూస్తాడు. ఈ విషయంలో ‘పెద్ది’ మూడు అడుగులు ముందే ఉంది. జూన్ 4న మూవీ విడుదల కానుండగా, జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ వేసేందుకు సిద్ధమైంది. ప్రీమియర్ టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, సోమవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, జూన్ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్‌ను కూడా కొన్ని థియేటర్స్ అందుబాటులోకి తెచ్చాయి.
జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీతో కలిపి), అలాగే జూన్ 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
టికెట్ ధరల పెంపు విషయమై ఇప్పటికీ తెలంగాణలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనిపై ఈ రోజు లేదా రేపటిలోగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అనుమతి రాకపోతే, చిత్ర బృందం ముందున్న ఏకైక ఆప్షన్ టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ ధరలతో వెళ్లిపోవడమే. ఇటీవల వచ్చిన ‘ధురంధర్2’ ఇదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ‘పెద్ది’ కూడా ఇదే ఫాలో కావచ్చు. ఇక అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం ఓవర్సీస్ ప్రీమియర్లు. ఇప్పటికే ‘పెద్ది’ కంటెంట్ ఎలాంటి అవాంతరాలు లేకుండా వెళ్లిపోయింది. అనుకున్న సమయానికి షో పడుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
© 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.