
Financial Rules : సామాన్యులు, టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త ఆర్థికపరమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటినుంచి యూజర్లు డబ్బు పంపే ముందు రిసీవర్ బ్యాంకులో రిజిస్టర్ అయిన ఒరిజినల్ నేమ్ ఇకపై కనిపిస్తుంది. అడ్వాన్స్ టాక్స్ మొదటి వాయిదాను జూన్ 15 లోగా చెల్లించాల్సి తప్పదు. మారుతి సుజుకి, హ్యుందాయ్ కార్ల ధరలు (Financial Rules June 1 ) భారీగా పెరగనున్నాయి. సోలార్ ప్యానెళ్లకు సంబంధించిన నిబంధనలు కూడా కఠినతరమయ్యాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలలో కూడా మార్పులు వచ్చాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. యూపీఐ పేమెంట్లకు అదనపు భద్రత : హై వాల్యూ యూపీఐ పేమెంట్లు చేసేవారు ఇకపై కేవలం యూపీఐ పిన్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోదు. కొన్ని యూపీఐ పేమెంట్ల కోసం ఫింగర్ ఫ్రింట్, ఫేస్ అథెంటికేషన్ లేదా అదనపు వెరిఫికేషన్ కూడా అవసరం పడొచ్చు. తద్వారా ఆన్లైన్ మోసాలు తగ్గుతాయి. పేమెంట్‌కు ముందే రిసీవర్ నేమ్ : యూపీఐ ద్వారా పేమెంట్లు చేసేటప్పుడు ఇకపై డబ్బులు పొందే వారి అధికారిక పేర్లు కనిపిస్తాయి. బ్యాంకు అకౌంట్లలో రిజస్టర్ అయిన పేర్లు చూసి అది వారిదా లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. తద్వారా రాంగ్ అకౌంటుకు డబ్బులు పంపే రిస్క్ తగ్గుతుంది. యూపీఐ, ఏటీఎం విత్డ్రాయల్స్పై కొత్త రూల్ : యూపీఐ ద్వారా కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి తీసుకునే క్యాష్ కూడా ఇప్పుడు బ్యాంక్ ఇచ్చే నెలవారీ ఫ్రీ విత్‌డ్రాయల్ లిమిట్ లెక్కిస్తుంది. లిమిట్ దాటితే అదనపు ఛార్జీలు చెల్లించకతప్పదు. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ జూన్ 15 లాస్ట్ డేట్ : 2026-27
Telugu » Business » Major Financial Changes From June 1 From Upi Atms Limits To Pan Card Rules Check Updated Norms
Financial Rules 2026 ( Image Credit : AI )
Financial Rules : సామాన్యులు, టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త ఆర్థికపరమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటినుంచి యూజర్లు డబ్బు పంపే ముందు రిసీవర్ బ్యాంకులో రిజిస్టర్ అయిన ఒరిజినల్ నేమ్ ఇకపై కనిపిస్తుంది.
అడ్వాన్స్ టాక్స్ మొదటి వాయిదాను జూన్ 15 లోగా చెల్లించాల్సి తప్పదు. మారుతి సుజుకి, హ్యుందాయ్ కార్ల ధరలు (Financial Rules June 1 ) భారీగా పెరగనున్నాయి. సోలార్ ప్యానెళ్లకు సంబంధించిన నిబంధనలు కూడా కఠినతరమయ్యాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలలో కూడా మార్పులు వచ్చాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
యూపీఐ పేమెంట్లకు అదనపు భద్రత : హై వాల్యూ యూపీఐ పేమెంట్లు చేసేవారు ఇకపై కేవలం యూపీఐ పిన్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోదు. కొన్ని యూపీఐ పేమెంట్ల కోసం ఫింగర్ ఫ్రింట్, ఫేస్ అథెంటికేషన్ లేదా అదనపు వెరిఫికేషన్ కూడా అవసరం పడొచ్చు. తద్వారా ఆన్లైన్ మోసాలు తగ్గుతాయి.
పేమెంట్‌కు ముందే రిసీవర్ నేమ్ : యూపీఐ ద్వారా పేమెంట్లు చేసేటప్పుడు ఇకపై డబ్బులు పొందే వారి అధికారిక పేర్లు కనిపిస్తాయి. బ్యాంకు అకౌంట్లలో రిజస్టర్ అయిన పేర్లు చూసి అది వారిదా లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. తద్వారా రాంగ్ అకౌంటుకు డబ్బులు పంపే రిస్క్ తగ్గుతుంది.
యూపీఐ, ఏటీఎం విత్డ్రాయల్స్పై కొత్త రూల్ : యూపీఐ ద్వారా కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి తీసుకునే క్యాష్ కూడా ఇప్పుడు బ్యాంక్ ఇచ్చే నెలవారీ ఫ్రీ విత్‌డ్రాయల్ లిమిట్ లెక్కిస్తుంది. లిమిట్ దాటితే అదనపు ఛార్జీలు చెల్లించకతప్పదు.
అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ జూన్ 15 లాస్ట్ డేట్ : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు లాస్ట్ డేట్ జూన్ 15గా నిర్ణయించింది. రూ.10వేల కన్నా ఎక్కువ టాక్స్ కట్టాల్సిన వారు తమ పన్నులో 15శాతం ఈ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే టాక్స్ చెల్లింపుపై వడ్డీ పెనాల్టీ పడొచ్చు.
Read Also : Gold Price Today June 1 : గోల్డ్ కొనేవాళ్లకు గుడ్ టైమ్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్‌డ్రా : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్ఓ యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసేందుకు కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం ఈ పేమెంట్ విధానాన్ని టెస్టింగ్ చేస్తోంది. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే మీ పీఎఫ్ డబ్బు క్షణాల్లో విత్ డ్రా చేయొచ్చు.
పాన్ కార్డు నిబంధనల్లో మార్పు : రూ.50వేలు పైబడిన సాధారణ క్యాష్ డిపాజిట్లకు పాన్ కార్డు తప్పనిసరి కాదు. అయితే, ఒకే ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ మొత్తం రూ.10 లక్షలు దాటితే పాన్ వివరాలు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది.
స్థిరాస్తి లావాదేవీలకు కొత్త లిమిట్ : ఇల్లు, భూమి కొనుగోలు, విక్రయాలకు పాన్ కోటింగ్ లిమిట్ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. అలాగే, రూ.45 లక్షలకు పైబడిన ఆస్తి లావాదేవీలకు రిపోర్టింగ్ తప్పనిసరి. మీ ఫోన్లలో యూపీఐ యాప్‌లను వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేసుకోండి. పేమెంట్ చేసే ముందు అకౌంట్ వివరాలు, పేమెంట్ రిసీవర్ పేరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
మారుతి సుజుకి, హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు : మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి కార్ల కంపెనీలు ధరలు పెరగనున్నాయి. మారుతి సుజుకి జూన్ నుంచి అన్ని మోడళ్ల ధరలను రూ. 30వేల వరకు పెంచుతోంది. ఈ పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా మొత్తం పోర్ట్‌ఫోలియోపై రూ. 12,800 వరకు ధరల పెంపును ప్రకటించింది.
సోలార్ ప్యానెళ్ల నిబంధనలు కఠినతరం : జూన్ 1, 2026 నుంచి సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ సోలార్ ప్రాజెక్టులు, నెట్-మీటరింగ్ సంబంధిత వ్యవస్థలలో ప్రభుత్వ ఆమోదిత జాబితా (ALMM)లో ఉన్న సోలార్ ప్యానెళ్లు, సోలార్ సెల్స్‌ను మాత్రమే ఉపయోగించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలలో ALMMలో ఉన్న కంపెనీల సోలార్ ప్యానెళ్లు, సెల్స్‌ను మాత్రమే ఏర్పాటు చేసుకోవచ్చు.
10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states.
Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd.