
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా (Russia).. సరికొత్త ఆయుధాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పిస్టల్ మాదిరి పరికరంతో సులభంగా ప్రయోగించే వీలున్న ‘యోల్కా’ ఇంటర్సెప్టర్లను (Yolka Interceptor) విస్తృతంగా వాడుతున్నట్లు కనిపిస్తోంది.
శత్రువుల డ్రోన్లను గాల్లోనే వెంటాడి, ఢీకొట్టే సామర్థ్యమున్న ఈ ఇంటర్‌సెప్టర్ డ్రోన్ ధర కూడా తక్కువేనని సమాచారం. వీటికి సంబంధించి రష్యా సైనికుల వీడియో వైరల్‌గా మారింది. సంప్రదాయ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లకు ఇది భిన్నం. తుపాకీ మాదిరి పరికరం సాయంతోనే ఈ చిన్న డ్రోన్‌ను ప్రయోగించవచ్చు.
కృత్రిమ మేధతోపాటు కెమెరా, సెన్సర్లను ఉపయోగించుకొని శత్రు డ్రోన్లను స్వయంగా ట్రాక్ చేస్తుంది. ఇందులో పేలుడు పదార్థం ఏమీ ఉండదు. అత్యంత వేగంతో వెళ్లి లక్ష్యిత డ్రోన్లను గాల్లోనే ఢీకొట్టి నాశనం చేస్తుంది. అందుకే.. ‘ఫైర్-అండ్-ఫర్గెట్’గా పేర్కొనే ఈ డ్రోన్ల ప్రాధాన్యం ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది.
లెబనాన్ బ్యూఫోర్ట్ క్యాజిల్‌ను స్వాధీనం చేసుకొన్న ఇజ్రాయెల్..! స్థూపాకారంలో ఉండే యోల్కా డ్రోన్‌కు ఎక్స్ ఆకారంలో రెండు జతల రెక్కలు ఉంటాయి. గాల్లో ఎగరడంతోపాటు స్థిరంగా ఉండగలదు. వెనక భాగంలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్లు.. కదలడానికి, నిర్దిష్ట మార్గంలో వెళ్లేందుకు దోహదపడతాయి.
గంటకు 200-250 కి.మీ వేగం దీని సొంతం. మూడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ ఇంటర్‌సెప్టర్ డ్రోన్ ఛేదించగలదని తెలుస్తోంది. చిన్నగా, తేలికగా ఉండే దీని ధర సుమారు 500 డాలర్లు అని అంచనా. యుద్ధ రంగంలో నిఘా డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి ఈ సరికొత్త ఆయుధాన్ని రష్యా రూపొందించినట్లు తెలుస్తోంది.
గతేడాది మేలో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో ఈ పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్యా ఈ యోల్కా ఇంటర్సెప్టర్లను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత.. ఉక్రెయిన్ సైన్యం తన
వ్యూహాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. నిఘా డ్రోన్లు తక్కువ ఎత్తులో తిరగడం వల్ల కూలిపోతున్నట్లు గ్రహించిన ఉక్రెయిన్ బలగాలు.. వాటి పరిధి పెంచినట్లు కథనాలు వస్తున్నాయి. గతంలో 150-200 మీటర్ల ఎత్తులో ఎగరగా.. ఇప్పుడు వాటిని 900 మీటర్లకుపైగా ఎగిరేలా చూసుకుంటున్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
© 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.