
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Sobhita Dhulipala News: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, ఆ తర్వాత జరిగిన వివాహం కారణంగా నటి శోభితా ధూళిపాళ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంది. వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు, మీడియా రకరకాల ఊహాగానాలతో కథనాలు అల్లారు. 2024 ఆగస్టులో నిశ్చితార్థం, అదే ఏడాది డిసెంబర్లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. ఇండస్ట్రీలోనే మోస్ట్ టాక్డ్ సెలబ్రిటీ వెడ్డింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే, పెళ్లయిన కొన్ని నెలల తర్వాత శోభిత తన వైవాహిక జీవితంపై, అలాగే తనపై వచ్చే నెగెటివిటీ, ట్రోల్స్‌పై ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పింది. ట్రోల్స్‌పై శోభిత సానుకూల దృక్పథం తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలపై శోభిత ఎంతో సానుకూలంగా స్పందించింది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ప్రజలకు ఉండేది కేవలం సహజమైన ఉత్సుకత మాత్రమేనని, అందుకే వారు అంతగా మాట్లాడుకుంటారని ఆమె సానుకూలంగా అభిప్రాయపడింది. "నేను ఎప్పుడూ నా వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతాను. నా చుట్టూ ఇతరులు చేసే ప్రతి చర్చకు లేదా విమర్శకు స్పందించాల్సిన అవసరం నాకు లేదు. కాలక్రమేణా నా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇతరులు నాపై చేసే నెగెటివ్ కామెంట్లు నా మనశ్శాంతిని ఏమాత్రం దెబ్బతీయలేవు" అని
శోభిత ధీమాగా వెల్లడించింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను, ట్రోల్స్‌ను శోభిత మారుతున్న వాతావరణ పరిస్థితులతో పోల్చడం విశేషం. "సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయంపై విపరీతమైన చర్చలు రావడం సర్వసాధారణం. నేను వీటన్నింటినీ వాతావరణ మార్పుల లాంటివేనని అనుకుంటాను. సమాజంలో కూడా కొన్ని వాతావరణ పద్ధతులు ఉంటాయి. దేన్నీ మనం మరీ అంత సీరియస్‌గా తీసుకోకూడదు, ఎందుకంటే ఇవేవీ శాశ్వతం కావు" అని శోభితా చెప్పుకొచ్చింది.
రూమర్లకు అతీతంగా వైవాహిక బంధం 2021లో సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత, 2022 నుండి చైతూ-శోభిత డేటింగ్లో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇన్నేళ్లూ ఎన్నో రూమర్లు వచ్చినా, నిశ్చితార్థం జరిగే వరకు ఈ జంట ఎక్కడా నోరు మెదపలేదు. ప్రస్తుతం శోభిత ఇచ్చిన ఈ ఇంటర్వ్యూను బట్టి చూస్తే.. ఆమె బయటి ప్రపంచం, సోషల్ మీడియా ఏమనుకుంటుంది అనే దానికంటే, తన భర్త నాగచైతన్యతో కలిసి తన వ్యక్తిగత సంతోషాన్ని ఆస్వాదించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read: స్టార్ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి..ఎట్టకేలకు పెళ్లిపై స్టార్ కమెడియన్ క్లారిటీ!
Also Read: బాలకృష్ణ చిన్న కూతురు ఒక్క వీడియోతో పాపులర్..ఆమె గురించి ఈ విశేషాలు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook