
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Shadashtak Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, వాటి కలయికలు, నక్షత్ర సంచారాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని అరుదైన గ్రహాల స్థితులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై 23, గురువారం ఉదయం 9 గంటల 46 నిమిషాలకు ఒక అత్యంత శక్తివంతమైన, అరుదైన ఖగోళ మార్పు సంభవించబోతోంది. శుక్రుడు, శని గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన, అరుదైన షడష్టక యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి తలరాతలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ముఖ్యంగా 4 రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. కాసుల వర్షం కురవడమే కాకుండా.. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్.. మేష రాశి: అరుదైన షడష్టక యోగం వల్ల మేష రాశి జాతకులకు గోల్డెన్ డేస్ మొదలు కాబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, ఊహించని గుర్తింపు లభిస్తుంది.. సమాజంలో మీ వ్యక్తిత్వానికి ప్రత్యేక గౌరవం పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభం కలిగే ఛాన్స్ కూడా లభిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి.. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కర్కాటక రాశి: శుక్ర, శనుల ఈ ప్రత్యేక కలయిక కర్కాటక రాశి వారికి కొత్త వెలుగులను ప్రసాదించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి.. సానుకూలత మరింత పెరుగుతుంది. జీవితంలోని అనేక సంక్లిష్ట సమస్యలకు సులభమైన పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది.. వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు విపరీతంగా పెరుగుతాయి. భౌతిక సుఖాలు, విలాసాలు విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులా రాశి: ఈ షడష్టక యోగం తులా రాశివారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయం గోల్డెన్ టైమ్‌గా భావించవచ్చు. అంతేకాకుండా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశివారికి ఇది అద్భుతమైన సమయంగా మారవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారికి పెద్ద పెద్ద డీల్స్ ఫైనల్ అవుతాయి. ముఖ్యంగా ప్రేమ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
మిథున రాశి: మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన సమయాన్ని తీసుకు రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో భారీ లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతో సహాయపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కోర్టు కేసులు లేదా వివాదాల నుంచి వీరు తప్పకుండా విజయవంతంగా బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. అందరి ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా ప్రేమ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది.
(నోట్: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అంచనాలు, ఇంటర్నెట్లో సమాచారం ఆధారంగా రాయబడింది. దీనిని నమ్మడం అనేది మీ వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.