
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్యకర దూషణల సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై తీవ్రమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన పలువురిని పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశ్న రావణ్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వివాదాస్పద యూట్యూబర్ బచలకురి జోసెఫ్‌ను పిఠాపురం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యంత అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినందుకు గానూప్రశ్న రావణ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఇతర పాత కేసుల కారణంగా పోలీసులు ఆయనను మళ్లీ అదుపులోకి తీసుకుంటున్నారు.
ఈ లీగల్ బ్యాటిల్లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు. అయితే.. ప్రశ్న రావణ్ కుటుంబ సభ్యులు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ను కలివడం జడ శ్రీవణ్ కు ఆగ్రహం కలిగేలా చేసింది. శుక్రవారం(జులై 3) ప్రశ్న రావణ్‌ను ఆసుపత్రి నుంచి నేరుగా మచిలీపట్నం కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. దానికి సంబంధించిన కేస్ రికార్డులను జుడీషియల్ అధికారులకు సమర్పించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో కోర్టు ప్రాంగణంలో ఒక అనూహ్య పరిణామం సంభవించింది.
ప్రశ్న రావణ్ కుటుంబ సభ్యులు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రహస్యంగా కలిశారన్న విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ శ్రవణ్ ఈ కేసులో ప్రశ్న రావణ్ తరఫున తాను ఇకపై వాదించబోనని, ఈ కేసు నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని కోర్టు ప్రాంగణంలోనే బహిరంగంగా ప్రకటించారు. ప్రధాన న్యాయవాది ఇలా హఠాత్తుగా తప్పుకోవడంతో కోర్టు వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. రావణ్ కుటుంబ సభ్యులు జడ శ్రవణ్‌ను బ్రతిమిలాడినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ హైడ్రామా నడుమ అర్ధరాత్రి దాటిన తర్వాత మచిలీపట్నం కోర్టు ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ట్విస్ట్‌లు అక్కడితో ముగిసిపోలేదు. బెయిల్ వచ్చిన వెంటనే, అనకాపల్లి పోలీసులు మరో పాత కేసులో ప్రశ్న రావణ్‌ను మళ్లీ తమ కస్టడీలోకి తీసుకోవడం సంచలనంగా మారింది.
High drama, Prasna Ravan case, Prashna Ravan, Jada Sravan Kumar, YS Jagan, Machilipatnam Court
లాహోర్ లో విదేశీ మహిళలపై సామూహిక అత్యాచారం.. పాక్ ఉప ప్రధాని సమీప బంధువు అరెస్ట్.!
.