యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కి భారీ అంచనాల నడుమ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డివైన్ మైథలాజికల్ థ్రిల్లర్ ' నాగబంధం : ది సీక్రెట్ ట్రెజర్' బాక్సాఫీస్ వద్ద సత్తా...
యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కి భారీ అంచనాల నడుమ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డివైన్ మైథలాజికల్ థ్రిల్లర్ ' నాగబంధం : ది సీక్రెట్ ట్రెజర్' బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సనాతన ధర్మం, పురాతన ఆలయాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయి. అయితే ఈ అద్భుతమైన విజువల్ వండర్‌ను చూసి బయటకు వస్తున్న ప్రతి ప్రేక్షకుడి నోట ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అతనే ఈ సినిమాలో మెయిన్ విలన్ 'అబ్దాలీ' పాత్ర పోషించిన రిషబ్ సాహ్నీ . థియేటర్లను షేక్ చేస్తున్న విలనిజంతెరపై అబ్దాలీ కనిపించిన ప్రతి క్షణం థియేటర్లో వైబ్స్ పూర్తిగా మారిపోతున్నాయి. ఒక క్రూరమైన, శక్తివంతమైన ప్రతినాయకుడిగా రిషబ్ తన కమాండింగ్ బాడీ లాంగ్వేజ్‌తో, కళ్లలోని తీవ్రతతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన మాగ్నెటిక్ ఆరాతో హీరోకి సమానమైన డామినేషన్ చూపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ విలన్ గురించే విస్తృతమైన చర్చ నడుస్తోంది. నెటిజన్లు ఆయన నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "అబ్దాలీ తెరపైకి వస్తే ఏదో ప్రళయం రాబోతోందన్న ఫీలింగ్ కలుగుతోంది", "హిందీ మూవీ 'ఫైటర్' తర్వాత రిషబ్ తన కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు", "అతని స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవల్" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. సినిమాకు అతనే అతిపెద్ద హైలైట్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.* విజువల్స్ అరాచకం.. కథనం వీక్.. 'నాగబంధం' సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? కథా నేపథ్యానికి వస్తే.. శ్రీరంగపురంలోని ఒక పురాతన ఆలయంలో దాగి ఉన్న బ్రహ్మకమలాన్ని, మహా శక్తివంతమైన 'నాగబంధం' గ్రంథాన్ని చేజిక్కించుకోవడం ద్వారా అమరత్వాన్ని పొందాలని దుష్ట శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో జుల్ఫికర్ అలీ ముఠా సాగించే ఆకృత్యాలను, విలన్ల ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొనే 'రుద్ర' అనే సాహసోపేత యువకుడి కథే ఈ చిత్రం. ఈ డివైన్ అడ్వెంచర్‌లో ఆలయ రహస్యాలు, పురాణాల కలయిక ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని పంచుతున్నాయి. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తెరకెక్కించారు. రుద్ర పాత్రలో విరాట్ కర్ణ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకోగా.. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ తమ అందం, అభినయంతో మెప్పించారు. సీనియర్ నటుడు జగపతిబాబు ఒక కీలకమైన ఆర్కియాలజిస్ట్ పాత్రలో ఒదిగిపోగా, బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ తనదైన శైలిలో అలరించారు. మొత్తం మీద, ఉత్కంఠభరితమైన పురాణ కథాంశంతో వచ్చిన 'నాగబంధం' ప్రేక్షకులకు ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసింది. ముఖ్యంగా మెగా విలన్‌గా రిషబ్ సాహ్నీ సృష్టించిన ఇంపాక్ట్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.