
మనకు లేనిదానిపైనే మన చూపంతా.. యువతలో బాగా ప్రబలుతున్న ఈ మానసిక నిర్లిప్తత ఇప్పుడు బడికెళ్లే పిల్లల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం పెద్దలకే కాదు..
Jul 4 2026 9:55 AM | Updated on Jul 4 2026 9:55 AM
మనకు లేనిదానిపైనే మన చూపంతా.. యువతలో బాగా ప్రబలుతున్న ఈ మానసిక నిర్లిప్తత ఇప్పుడు బడికెళ్లే పిల్లల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం పెద్దలకే కాదు.. చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ కన్నవాళ్లను కలవరపెడుతోంది. ‘అందరూ ఏదేదో చేస్తున్నారు.. ఎక్కడికంటే అక్కడికెళుతున్నారు వారిలా నేనెందుకు లేను.. వారిలా నేనెందుకు ఏ పనీ చేయలేకపోతున్నాను.. ’ఈ భావననే ‘ఫెమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అంటారు. ఎప్పుడూ ఎదుటివారిలా తానెందుకు ఉండలేకపోతున్నానని బాధపడడం, ఎప్పుడూ తనని తాను నిందించుకుంటూ ఉండడం, కోపం వచ్చినా.. దానిని ఎవరి మీద చూపించాలో తెలియక అవస్థలు పడడం... ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే ఏం చేయాలో వెంటనే ఈ సూచనలు పాటించడం మంచిది.
ఎవరిలో ఫెమో ఉంది? 1. తరచూ ఫోన్లో తన వయసువాళ్ల వీడియోలు, రీల్స్ చూడడం, తనెందుకు చేయలేకపోతున్నానని బాధపడడం 2. తమకు లేని ప్రతిభ కోసం లేదా తమ దగ్గర లేని వస్తువుల కోసం పట్టుబట్టడం. 3. ప్రతి విషయానికీ ఇతరులతో పోల్చుకోవడం. ఆత్మన్యూనతాభావానికి లోనవ్వడం. 4. చిన్న పొరపాటు జరిగినా తమని తాము నిందించుకోవడం. 5. ఏ పని చేయాలన్నా ఆసక్తి కనబరచక పోవడం, ఒంటరిగా ఫీలవ్వడం.
ఏం చేయాలి? 1. ఫెమో సమస్య కి విరుగుడు జెమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్). పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు వారిని మందలించడం కంటే ప్రతిరోజు వారితో కాస్త సమయం గడపాలి. వారి సమస్యల్ని వినాలి. 2. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజ జీవితం కాదని వారికి అర్థమయ్యేలా చె΄్పాలి. 3. స్క్రీన్ టైమ్‌కు పరిమితులు విధించి, ఆటలు, పుస్తక పఠనం, సంగీతం, కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని ్రపోత్సహించాలి. 4. ఎవరినో చూసి వారిలా ఉండాలని కోరుకోవడం కన్నా నువ్వు నీలా ఉంటేనే మంచిదని తెలిసేలా చేయాలి. 5. నచ్చిన పని చేసినప్పుడు వచ్చే అనుభూతే నిజమైన ఆనందమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి.
హర హర మహాదేవ అంటూ అమర్నాథ్ యాత్ర ప్రారంభం (ఫొటోలు)
కోలీవుడ్ నటుడు అరవింద్ ఆకాశ్ గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
హైదరాబాద్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి (ఫొటోలు)
మా ఇంటి బంగారం జ్ఞాపకాల్లో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
61 ఏళ్ల వయసులో మూడో వివాహానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో
కార్యకర్తలా, గుండాలా..? ప్రశ్నిస్తే చంపేస్తారా.? ప్రకాష్ రాజ్ వైరల్ వీడియో
సాయికృష్ణ ను జైల్లో చంపినట్లే... ప్రశ్న రావణ్ ను కూడా చంపడానికి మాస్టర్ ప్లాన్..!
రావణ్ పై ఎన్ని కేసులైన పెట్టుకోండి.. బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది
బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ మళ్ళీ అరెస్ట్...