
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Affordable Cities India: భారతదేశంలో సొంత ఇల్లు కొనాలనే కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి 2026 మొదటి అర్ధభాగం ఊరటనిచ్చిందని చెప్పాలి. ఎందుకంటే.. . ఆర్బిఐ వడ్డీ రేట్లను మొత్తం 125 బేసిస్ పాయింట్లు తగ్గించడమే ప్రధాన కారణం అని చెప్పాలి. దేశంలోని ప్రధాన నగరాల్లో నివాస గృహాల కొనుగోలు శక్తి చాలా వరకు సానుకూలంగా ఉందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత సరసమైన నగరంగా నిలిచింది. ఇక్కడ ఇల్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్ధ పేర్కొంది.
అహ్మాదాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ రూ. 3.5లక్షల నుంచి రూ. 6లక్షల వరకు అందుబాటులో ఉంది. నగర శివారులో అయితే ఈ ధరలు మరింత తక్కువగా ఉన్నాయి. పుణేలో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ధర రూ. 50లక్సల నుంచి 80లక్షల మధ్య ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ. 30లక్షల నుంచి రూ. 55లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇండోర్ మరీ తక్కువగా ఉందని చెప్పాలి. 25లక్షల నుంచి 45 లక్షలు ఖర్చు చేస్తే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనవచ్చు. జైపూర్ లో 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంది.
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. ఒక కుటుంబం తమ నెలవారీ ఆదాయంలో ఈఎంఐల కోసం ఖర్చు చేసే శాతం ఆధారంగా కొనుగోలు శక్తిని లెక్కిస్తారు. ఈ నిష్పత్తి 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. దానిని సరసమైనదిగా పరిగణిస్తారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 6 ఈ 50 శాతం పరిమితి కంటే తక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్ కేవలం 23 శాతం నిష్పత్తిని నమోదు చేసింది. ఆ తర్వాత కోల్‌కతా (25 శాతం) పూణే (28 శాతం) ఉన్నాయి.
అయితే.. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ లలో ధరలు అధికంగానే ఉన్నాయి. రెండు నగరాల్లోనూ కొనుగోలు శక్తి 50శాతం మార్కును దాటడంతో.. కొనుగోలుదారులపై భారం పడింది. ఎన్‌సిఆర్‌లో ఈ రేటు 65శాతం వద్ద మరీ ఎక్కువగా ఉంది.
గత ఏడాదితో పోల్చి చూసినట్లయితే.. బెంగళూరు (35శాతం) ఎన్‌సిఆర్ (65శాతం)లలో కొనుగోలు శక్తి స్వల్పంగా తగ్గింది. మార్కెట్లోని మిగిలిన ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్బిఐ రెపో రేటును దశాబ్దపు కనిష్ట స్థాయికి తగ్గించిన తర్వాత కొనుగోలు శక్తి గణనీయంగా మెరుగుపడింది. అయితే.. అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి 2022 మే నుండి ఆర్బిఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచడంతో, కొనుగోలు శక్తిపై మళ్లీ ప్రభావం పడింది. 2023 నుండి, స్థిరమైన వడ్డీ రేట్లు, ఇటీవల 125 బేసిస్ పాయింట్ల కోత గృహ రుణాలపై భారాన్ని తగ్గించాయి. దీంతో అమ్మకాలు పుంజుకున్నాయి.
నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. ఇటీవల, పెరుగుతున్న ఆస్తి ధరలు కొనుగోలు శక్తి వృద్ధిని మందగింపజేశాయి. అయితే, స్థిరమైన ఆదాయాలు, మంచి ఉద్యోగ అవకాశాలు, అనుకూలమైన రుణ పరిస్థితులు గృహాల డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నాయి. భవిష్యత్తులో మార్కెట్ వృద్ధి చెందడం కొనసాగాలంటే, ఆదాయ వృద్ధి స్థిరంగా ఉండటం, మార్కెట్ సమతుల్యంగా ఉండటం ముఖ్యమని వెల్లడించారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.