స్కిన్‌కేర్‌లో ప్రొడక్ట్స్‌లో సన్‌స్క్రీన్ చాలా ముఖ్యమైనది. సన్‌స్క్రీన్ మన చర్మాన్ని సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి.
చర్మం నల్లబడకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తుందని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధ్యయనం పేర్కొంది. అందుకే వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా ప్రతి రోజూ మన చర్మానికి సన్‌స్క్రీన్‌ను అప్లయ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్నిసార్లు సన్‌స్క్రీన్‌ను అప్లయ్ చేసుకుని బయటకు వెళ్తే.. ఎండ, వాతావరణం ఎఫెక్ట్ వల్ల చెమట పట్టి సన్‌స్క్రీన్ లేయర్ కరిగి కళ్లలోకి వెళ్లి, అవి మండుతుంటాయి. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ అప్లై చేసుకుంటే.. చివరికి అది కళ్లలోకి వెళ్లి కళ్లు విపరీతంగా మండుతుంటాయి. అసలు అలా ఎందుకు జరుగుతుంది? కళ్లకు ప్రమాదమా? దీని ఎలా నివారించాలి అని ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..ఇలా ఎందుకు జరుగుతుందిమన చర్మానికి అప్లై చేసిన సన్‌స్క్రీన్ రోజంతా ఒకేచోట సరిగ్గా ఉండదు. చెమట, సహజ నూనెలు, ముఖ కవళికల వల్ల కూడా సన్‌స్క్రీన్ ముఖంలోని ఇతర భాగాల నుంచి మీ కళ్లలోకి చేరవచ్చు. మన ముఖంలోని మిగతా భాగంతో పోలిస్తే కళ్ల చుట్టూ ఉన్న చర్మం పలుచగా, మరింత సున్నితంగా ఉంటుంది. అందుకే ఏదైనా చికాకు కలికించే పదార్థాలకు కంటి చుట్టూ ఉంటే చర్మం త్వరగా రియాక్ట్ అవుతుంది. ఆ సమయం కళ్లు రుద్దితే.. సన్‌స్క్రీన్ కళ్లలోకి వెళ్లి అవి మండుతాయి. సున్నితమైన కళ్ల కోసం మినరల్ సన్స్క్రీన్స్కెమికల్ ఫార్ములాలతో తయారైన సన్స్క్రీన్స్తో పోలిస్తే మినరల్ సన్స్క్రీన్ల కళ్ల మంట తక్కువగా ఉండే అవకాశం ఉంది. మినరల్ సన్స్క్రీన్లలో జింక్ ఆక్సైడ్ వంటివి ఉంటాయి, ఇవి చర్మంపైనే ఉండి యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. కెమికల్ సన్‌స్క్రీన్స్ చర్మం లేనికి ఇంకిపోయి చికాకు తెప్పిస్తాయి. మినరల్ సన్‌స్క్రీన్‌లకు చిక్కటి ఫార్ములేషన్ ఉంటుంది. ఇది కళ్లలోకి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. మినరల్ సన్‌స్క్రీన్ వల్ల అసలు మంట పుట్టదని కాదు, అయితే కెమికల్ సన్‌స్క్రీన్ కంటే ఇవి బెటర్.స్టిక్ ఫార్ములా హెల్ప్ అవుతుందిచెమటకు సన్‌స్క్రీన్ జారిపోకుండా ఉండటానికి స్టిక్ ఫార్ములా సన్‌స్క్రీన్ గొప్ప సొల్యూషన్. స్టిక్ ఫార్ములా సన్‌స్క్రీన్ మందంగా ఉంటుంది. కంటి ప్రాంతంలో స్టిక్ సాయంతో సులభంగా, చక్కగా అప్లై చేసుకోవచ్చు. మీకు చెమట పట్టినప్పుడు సన్‌స్క్రీన్ కళ్లలోకి కారే అవకాశం తక్కువగా ఉంటుంది. మీకు కావలసిన చోట సన్‌స్క్రీన్ అప్లై చేయడానికి, టచ్ అప్ చేయడానికి స్టిక్ ఫార్ములా సహాయపడుతుంది.కళ్ల మంట నివారించడానికి సన్‌స్క్రీన్ ఎలా అప్లయ్ చేయాలిమీరు బయటకు వెళ్లే కనీసం 15 నిమిషాల ముందు శుభ్రమైన, పొడి చర్మంపై సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. కంటి చుట్టూ ఉండే ఎముక (ఆర్బిటల్ బోన్) వద్ద మినరల్ స్టిక్‌ను ఉపయోగించండి. సన్‌స్క్రీన్‌ను సున్నితంగా అప్లై చేయండి, గట్టిగా రుద్దితే అది కళ్లలోకి వెళ్లవచ్చు. ప్రతి 2 గంటలకు ఒకసారి, చెమట పట్టిన ప్రతి 80 నిమిషాలకు ఒకసారి, ముఖం తుడుచుకున్న వెంటనే జాగ్రత్తగా మళ్ళీ అప్లై చేయండి.కళ్లలో సన్‌స్క్రీన్ కంట్లో పడితే ఏమి చేయాలి ఒకవేళ అనుకోకుండా సన్‌స్క్రీన్ కళ్లలోకి వెళ్తే.. శుభ్రమైన నీటితో లేదా సెలైన్‌తో మెల్లగా శుభ్రం చేసుకోండి. కంటిని రుద్దవద్దు. కంటి నుంచి నీళ్లు వస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది కనుక, వెంటవెంటనే కంటి రెప్పలు వేయండి. ఈ నీటి ద్వారా సన్‌స్క్రీన్ కంటి నుంచి వచ్చేస్తుంది. సన్‌స్క్రీన్ కేవలం కంటికి చికాకు తెప్పిస్తుంది, ఇది ఎలాంటి కంటి సమస్యలకు కారణం కాదు. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.