టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని , వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ ది ప్యారడైజ్ ’. ఎస్.ఎల్.
వి సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘దసరా’ సంచలన విజయం సాధించడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే సరికొత్త, పవర్ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా సుబ్బలక్ష్మి అనే భిన్నమైన పాత్రలో కయాదు లోహర్ నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు విలన్ పాత్రను పోషిస్తుండటం విశేషం. వీరితో పాటు సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, జికె విష్ణు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.* 'ఈసారి గ్యాప్ తీసుకుంటే ఫ్యాన్స్ ఇంటికొచ్చి కొట్టాలి'... అఖిల్ అక్కినేని షాకింగ్ కామెంట్స్ వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఆగస్ట్ 21న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెప్టెంబర్ 25కి షిఫ్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, అలాగే అంతర్జాతీయ భాషలైన స్పానిష్, ఇంగ్లీష్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సినిమా ఆలస్యం కావడం వల్ల నిర్మాతపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉండటంతో, నాని మరే ఇతర ప్రాజెక్టులను ఒప్పుకోకుండా పూర్తి దృష్టిని ఈ సినిమాపైనే పెట్టారు. నిర్మాతకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చేజారిన రెండు క్రేజీ సినిమాలు‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నాని రెండు అద్భుతమైన ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. అందులో మొదటిది ‘హాయ్ నాన్న’ వంటి హృదయపూర్వక చిత్రాన్ని అందించిన దర్శకుడు శౌర్యువ్ ప్రాజెక్ట్. నాని కోసం శౌర్యువ్ ఒక చక్కని కథను సిద్ధం చేసినప్పటికీ, సమయాభావం వల్ల నాని ఆ సినిమాను పట్టాలెక్కించలేకపోయారు. దీనితో దర్శకుడి సమయం వృథా కాకూడదని, వేరే హీరోతో ముందుకు వెళ్లమని నాని స్వయంగా సూచించారు. దీంతో ఆ ప్రాజెక్టు విజయ్ దేవరకొండ వద్దకు చేరింది. ఇక రెండో ప్రాజెక్ట్.. ‘జై భీమ్’ ఫేమ్ కోలీవుడ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌తో తలపెట్టింది. ఆయన చెప్పిన సబ్జెక్ట్ నానికి ఎంతో నచ్చినప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు. ప్రస్తుతం జ్ఞానవేల్ హీరో సూర్యతో ఒక కొత్త సినిమాను ప్రారంభించారు.* మొగుడు తప్ప జీవితంలో అన్నీ ఉన్నాయి.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే - నందిని రెడ్డి ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే నాని, టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘ బ్లడీ రోమియో ’ అనే చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను 2027 వేసవిలో విడుదల చేయాలని ప్రాథమికంగా భావించారు. అయితే, సుజీత్ మరోవైపు పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ-2’ చిత్రాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, సుజీత్ ఇతర కమిట్మెంట్ల వల్ల ‘బ్లడీ రోమియో’ అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందా లేదా అనే సందేహాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ, ‘ది ప్యారడైజ్’ కోసం నాని చేసిన త్యాగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.