
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుజానే ఖాన్ విడాకుల చుట్టూ గత కొన్నేళ్లుగా సాగుతున్న ఒక పెద్ద వివాదానికి తెరపడింది. విడాకుల సెటిల్మెంట్ కింద సుజానే ఖాన్.. హృతిక్ రోషన్ నుండి రూ.
400 కోట్ల భరణం తీసుకుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆమె సోదరి, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ ఖండించారు. జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరా ఈ విషయాలను వెల్లడిస్తూ... ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తన సోదరి హృతిక్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు."ఆన్లైన్లో రూ. 400 కోట్లు చెల్లించారని, దానివల్ల సుజానే ధనవంతురాలైందని ప్రజలు మాట్లాడటం చూస్తుంటే నా మనసుకు చాలా బాధేస్తుంది. అది పచ్చి అబద్ధం. నా ప్రియమైన సోదరి భరణంగా ఏమీ తీసుకోలేదు" అని ఫరా ఖాన్ అలీ స్పష్టం చేశారు. భౌతికపరమైన వస్తువుల కంటే బంధాలే ముఖ్యమని తమ తల్లి తమకు నేర్పిందని, అందుకే సుజానేకు ఆమె మాజీ భర్త హృతిక్‌తో మాత్రమే కాకుండా, మాజీ అత్తమామలైన పింకీ, రాకేష్ రోషన్లతో కూడా ఇప్పటికీ అద్భుతమైన అనుబంధం ఉందని ఆమె పేర్కొన్నారు. సుజానే చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిందని, ఆమె 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు ఆశించే వ్యక్తి) కాదని, ఎంతో హుందాగా ప్రవర్తించిందని సోదరి అండగా నిలిచారు.ఈ అబద్ధపు ప్రచారాలను ఖండించాల్సిందిగా తాను సుజానేకు ఎన్నోసార్లు చెప్పానని, అయితే సుజానే మాత్రం.. "నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం