
ఫిఫా వరల్డ్ కప్ వేదికగా జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఊహించని ఉత్కంఠ నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్స్ అర్జెంటీనా.. కేప్ వెర్డే లాంటి జట్టుతో చివరిదాకా పోరాడాల్సి వచ్చింది.
Jul 4 2026 6:56 AM | Updated on Jul 4 2026 7:09 AM
ఫిఫా వరల్డ్ కప్ వేదికగా జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఊహించని ఉత్కంఠ నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్స్ అర్జెంటీనా.. కేప్ వెర్డే లాంటి జట్టుతో చివరిదాకా పోరాడాల్సి వచ్చింది. ఒక దశలో మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందోనని ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూశారు. హోరాహోరీ పోరులో.. చివరకు 3-2 తేడాతో అర్జెంటీనా కాబో వెర్డె (Cabo Verdy)ను ఓడించి రౌండ్ ఆఫ్-16లో అడుగుపెట్టింది.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా.. మియామి హార్డ్‌రాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఆద్యంతం ఉత్కంఠను పంచింది. ప్రారంభంలో అర్జెంటీనా ఆధిపత్యం చాటింది. అయితే ఒక్క గోల్ పడకుండా కాబో వెర్డె రక్షణ గోడలా నిలబడి అడ్డుకుంది. ఈ క్రమంలో 29వ నిమిషంలో మెస్సీ Lionel Messi అద్భుతమైన టచ్‌తో గోల్ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగం 1-0తో ముగిసింది.
రెండో అర్ధభాగంలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వెనక్కి తగ్గని కాబో వెర్డె ఫాస్టెస్ట్ కౌంటర్ అటాక్స్‌తో అర్జెంటీనాను ఒత్తిడిలోకి నెట్టింది. ఆట 59వ నిమిషంలో డెరోయ్ డువార్టే గోల్‌తో స్కోర్‌ను 1-1 చేసింది. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ పోరుగా మారి ఉత్కంఠను పెంచింది.
అర్జెంటీనా తరఫున మెస్సీ, లౌటారో మార్టినెజ్ ప్రయత్నాలు చేసినా.. కాబో వెర్డె గోల్‌కీపర్ వోజిన్హా అద్భుత సేవ్‌లతో నిలబడ్డాడు. నిర్ణీత 90 నిమిషాల్లో విజేత తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడే అసలైన డ్రామా మొదలైంది.
అదనపు సమయం ప్రారంభమైన వెంటనే 93వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా మళ్లీ ముందంజలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 103వ నిమిషంలో లారోస్ కాబ్రాల్ అద్భుతమైన షాట్‌తో కాబో వెర్డెను మళ్లీ సమం చేశాడు.
కానీ ఈ ఉత్కంఠ అక్కడితో ఆగలేదు. 111వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో హెడర్ గోల్‌తో అర్జెంటీనా మరోసారి ఆధిక్యం సాధించింది. చివరి నిమిషాల్లో కాబో వెర్డె వరుస ఎటాక్స్ చేసినా.. ఎమిలియానో మార్టినెజ్ అద్భుత సేవ్‌లతో గోడలా నిలబడ్డాడు. చివరికి 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టింది.
అయితే.. గెలుపు డిఫెండింగ్ ఛాంపియన్‌దే అయినా అల్ప జనాభా ఉన్న చిన్న దేశమైనా కాబో వెర్డె చూపిన పోరాటం ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకట్టుకుంది. ఆఫ్రికా పడమటి తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న చిన్న దీవుల దేశం కాబో వెర్డె.. ఫిఫా గ్రూప్ దశ నుండి నాకౌట్ వరకు ఇచ్చిన పోరాటం, పెద్ద జట్లను ఒత్తిడిలోకి నెట్టిన తీరు, గుర్తుండిపోయే “అండర్డాగ్ స్టోరీ”గా నిలిచింది.
కోలీవుడ్ నటుడు అరవింద్ ఆకాశ్ గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
హైదరాబాద్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి (ఫొటోలు)
మా ఇంటి బంగారం జ్ఞాపకాల్లో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ మెహరీన్ (ఫొటోలు)
ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)
టీడీపీ కార్యకర్తను అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది.. బాబు, లోకేష్ లు ప్రజలను మోసం చేస్తున్నారు
పవన్ గుట్టు రట్టు.. రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత ఆడియో లీక్
రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్
ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?