
ఈ ఆసనంలో శరీరం పడగవిప్పిన పాము ఆకృతిలో ఉంటుంది. అందుకే భుజంగాసనం అని పేరు. చేసే విధానం: మ్యాట్పైన బోర్లా పడుకోండి. కాళ్లను, మడమలను దగ్గరగా తీసుకొచ్చి నిటారుగా ఉంచండి.
చేతులను ఛాతీకి ఇరుపక్కలా ఉంచి విశ్రాంతిగా పడుకోండి. ఇప్పుడు గాలి తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపండి. అరచేతుల్ని నేలపై అదిమి పెట్టి తలనూ, ఛాతీ భాగాన్నీ, నాభి స్థానం వరకూ పైకి లేపండి. ఇదే స్థితిలో ఉంటూ 10-15 సెకన్లు సాధారణ శ్వాసలు తీసుకోవాలి. ఆపై నెమ్మదిగా యథాస్థానానికి వచ్చి శవాసనంలో విశ్రాంతి పొందండి.
ఉపయోగాలు: పొట్ట కండరాలకు బలాన్ని ఇస్తుంది. పొట్టను బిగుతుగా చేస్తుంది. వెన్నునొప్పికి మంచి ఆసనం. అండాశయానికి మేలు చేస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.
జాగ్రత్తలు: హెర్నియా, గుండె సమస్యలున్నవారు నిపుణుల సమక్షంలోనే చేయాలి. గర్భిణులు చేయకూడదు.
ఆహారం: చక్కెర వినియోగం తగ్గాలి. కార్బోహైడ్రేట్స్ అవసరానికి మించి తీసుకోవద్దు. పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల్ని తీసుకోవాలి. వీటితోపాటు నిత్యం వ్యాయామాలు చేయాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.