
AP Rain Alert : ఏపీలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాల పడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
Meteorological Department has forecast heavy rains today in several districts of Andhra Pradesh
AP Rain Alert : ఏపీలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాల పడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా.. వాతావరణ శాఖ ఏపీ వర్షాలపై బిగ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి వారం రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, భీకరగాలులతోపాటు.. పిడుగులు పడే చాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు నుంచి వారం రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని, గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో నేడు (శనివారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు జిల్లాల్లోని కొన్నిచోట్ల మోఘావృత వాతావరణంతోపాటు ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని, చెట్లు కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.