
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Monetisation Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో చాలా మంది ప్రజల లాకర్లు, అల్మారాలలో వేల రూపాయల విలువైన బంగారం ఉంటుంది. చాలా మంది తమ బంగారాన్ని లాకర్లలో భద్రపరుస్తుంటారు. ఈ బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక మూల స్తంభంగా మార్చేందుకు.. బంగారు నగదీకరణ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాబోయే 15 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దేశంలోని 25,000 టన్నుల బంగారంలో కనీసం 5 శాతాన్ని ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తే.. 1,250 టన్నుల బంగారం ఆర్థిక వ్యవస్థకు చేకూరుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఈ 5 శాతం విలువ రూ. 8 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది.
అయితే.. ఈ బంగారు నగదీకరణ పథకాన్ని ఇదివరకే అమలు చేశారు. 2015లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతేకాకుండా.. ఆ సమయంలో బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అమలు చేస్తున్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా ఉన్న నగల వ్యాపారులు భాగస్వాములు కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగినట్లయితే.. ప్రజలకు తమ సమీపంలోని ప్రతిష్టాత్మక నగల దుకాణంలో తమ బంగారాన్ని డిపాజిట్ చేసే అవకాశం లభిస్తుంది. అయితే.. ఇక్కడ కొన్ని భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా.. మీరు ఉపయోగించని బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే.. మీకు ఎలాంటి ఆదాయం రాదు. అయితే.. మీరు దానిని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో డిపాజిట్ చేసినట్లయితే.. బంగారంపై వడ్డీని పొందుతారు. అంతేకాదు.. అవసరమైతే దానికి సమానమైన బంగారాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఉపయోగించని బంగారం నుండి ఆదాయాన్ని సంపాదించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పాలి.
ఈ కొత్త పథకం అమలు చేస్తే.. అది నగల దుకాణాలకు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రజల నుండి బంగారాన్ని సేకరించే బాధ్యత వారిపైనే ఉన్నందున.. వారి వద్దకు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. భారతదేశం ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందని.. దీనివల్ల గణనీయమైన విదేశీ మారక ద్రవ్య వ్యయం అవుతుందని తెలిసిందే.
అయితే.. ఈ పథకం విజయవంతమైతే, బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. 2015లో ప్రారంభించిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెద్దగా విజయవంతం కాలేదు. 10ఏళ్లలో ఈ పథకం కింద కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే డిపాజిట్ చేసింది. కుటుంబ వారసత్వ ఆస్తులను అమ్మడానికి ప్రజలు విముఖత చూపడం.. పన్నుల పరిణామాల గురించిన భయాలు, బ్యాంకుల నుండి ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాల వల్ల ఇది జరిగిందని విశ్లేషణలో తేలింది.
ఈ స్కీమ్ ఎందుకు విఫలం అయ్యింది? దాదాపు 10ఏళ్ల కాలంలో ఈ స్కీమ్ ద్వారా కేవలం 38 టన్నుల బంగారాన్ని మాత్రమే సేకరించగలిగారు. కానీ భారతీయుల వద్ద సుమారు 25వేల టన్నుల బంగారం ఉందని అంచనా. దీన్ని బట్టి చూస్తే ఈ స్కీమ్ ఆశించిన మేర విజయవంతం కాలేదని చెప్పాలి.
* భారతీయుల్లో చాలా మంది తమ పూర్వీకుల నుంచి వచ్చిన నగలను డిపాజిట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
*పన్ను సంబంధింత విచారణలు వస్తాయన్న భయం ప్రజల్లో నెలకొంది.
*బ్యాంకులు ఈ స్కీమ్ ద్వారా పెద్దగా లాభాలు లేకపోవడంతో ప్రోత్సహించలేదు.
*ప్రభుత్వం వడ్డీతోపాటు బంగారం ధర పెరిగితే అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వారానికి అధిక భారమైంది.
ఇప్పుడు తీసుకువస్తున్న కొత్త మార్పులు ఏంటి?
గోల్డ్ మానిటైజేషన్ స్కీములో భాగంగా కేంద్రం తీసుకురానున్న కొత్త మార్పులు ఏంటంటే.. దేశవ్యాప్తంగా ఉన్న బంగారు నగల వ్యాపారులు కూడా కలెక్షన్ పార్టనర్లుగా పనిచేసే ఛాన్స్ కల్పిస్తుండటం. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం బ్యాంకులు మాత్రమే డిపాజిట్ చేసుకునేవి. ఇక నుంచి ప్రజలు తమకు దగ్గరలో ఉన్న బంగారు దుకాణాలకు బంగారాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని ప్రజలకు సౌకర్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరింత బంగారం ఈ స్కీములోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని అనుకుంటోంది.
*ఇళ్లలో ఉపయోగం లేని బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.
*విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకునే అవసరం చాలా వరకు తగ్గుతుంది.
*దేశం డాలర్లపై ఆధారపడే అవకాశం తగ్గుతుంది.
* ఈ స్కీమ్ వల్ల రూపాయి బలపడే ఛాన్స్ ఉంటుంది.
*బంగారం వ్యాపారాలు మరింత పారదర్శకంగా మారే ఛాన్స్ ఉంటుంది.
*దిగుమతులు తగ్గడంతో.. బంగారం ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ మధ్య కాలంలో భారత ప్రధాని మోదీ ఒక ఏడాది పాటు కొత్త బంగారం కొనడం వాయిదా వేయాలని ఇచ్చిన పిలుపు మేరకు కొనుగోళ్లు చాలా వరకు తగ్గాయి. దీని వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి కూడా భారీగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.