
దిల్లీ: అమెరికా కాకుండా భారత్ సహా మరే ఇతర దేశంలోనైనా ఉండి ఉంటే బహుళజాతి కంపెనీల్లో ఒకటైన ‘పెప్సీకో’కు తాను సీఈవో కాలేకపోయేదాన్ని అని ఆ సంస్థ మాజీ ఛైర్పర్సన్, సీఈవో ఇంద్రా నూయీ వ్యాఖ్యానించారు.
అమెరికాలో ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించే ‘మెరిటోక్రటిక్’ వ్యవస్థ ఉండటం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు ఆమె వెల్లడించారు. అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కండోలీజా రైస్‌తో ‘ఆవిష్కరణ, యోగ్యతా విధానం’పై జరిగిన సంభాషణ సందర్భంగా నూయీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికా వ్యవస్థ యోగ్యతా ప్రాతిపదికన నడుస్తుంది. ఇక్కడి మార్గదర్శకులు మీరు స్త్రీనా? లేక పురుషులా? అనేది పట్టించుకోరు. అత్యుత్తమ మేధావులు మాత్రమే ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటారు. అమెరికా అత్యుత్తమ దేశం. వలసదారులకు ఇక్కడ లభించే అవకాశాలు మరెక్కడా దొరకవు’’ అని నూయీ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.