.webp&w=3840&q=75)
విశాఖపట్నంలోని అత్యంత వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ విషయంలో ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ..
500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఈ మంత్రుల కమిటీ పలుమార్లు సమావేశమై, వివిధ ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. ఈ ప్యాలెస్‌ను అంతర్జాతీయ స్థాయి సంస్థలకు లీజుకు ఇవ్వడమే ప్రభుత్వానికి లాభదాయకమని తుది నిర్ణయానికి వచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రుషికొండ ప్యాలెస్ తో పాటు దానికి ఆనుకుని ఉన్న 9 ఎకరాల అదనపు భూమిని లీజు, ఆపరేషన్, మేనేజ్మెంట్, అభివృద్ధి కోసం అధికారికంగా అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఈ టెండర్ల దాఖలుకు ఈ నెల 10 తుది గడువుగా నిర్ణయించింది. రుషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ రిసార్ట్ లేదా, ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చాలని ఏపీ టూరిజంభావిస్తోంది. గతంలో ఈ కొండపై ఉన్న టూరిజం రిసార్ట్స్ ద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించేది. గత ప్రభుత్వం వాటిని తొలగించి ఈ భారీ ప్యాలెస్‌ను నిర్మించింది. అప్పటి నుంచి ఆదాయం లేకపోగా, ఈ ప్యాలెస్ మెయింటేనెన్స్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.
ఈ నేపథ్యంలోనే రుషికొండ ప్యాలెస్ ను పర్యాటక రంగంలో సరికొత్త గ్లోబల్ ఐకాన్‌గా తీర్చిదిద్దడం ద్వారా అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతో పాటు, వైజాగ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ టెండర్ ప్రకటనతో గత కొద్ది రోజులుగా రుషికొండ భవనాల భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికినట్లైంది.
ఆర్మీ చీఫ్‌కు తండ్రి, తమ్ముడి సెల్యూట్.! భావోద్వేగ ఘట్టం.!
.