
సెలవులు లేదా వారాంతం చివరి రోజు రాగానే చాలామందికి కలిగే భావన ఒక్కటే.. 'అయ్యో, ఇంకో రోజు సెలవుంటే ఎంత బాగుండును!'.
పని ఒత్తిడి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో, వారానికి మూడు రోజుల వీకెండ్ అనేది చాలామంది భారతీయులకు ఒక కలలాంటిదే. ఇటీవల దుబాయ్ ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం 'అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్' పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ఈ అంశంపై భారత్‌లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది.దుబాయ్ మోడల్.. భారతీయ ఆలోచనజూన్ 29 నుంచి సెప్టెంబర్ 10 వరకు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రకాల ఫ్లెక్సిబుల్ పని విధానాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక విధానంలో సోమవారం నుంచి గురువారం వరకు ఏడు గంటలు, శుక్రవారం తక్కువ సమయం పనిచేయాలి. మరో విధానంలో నాలుగు రోజులు రోజుకు ఎనిమిది గంటల చొప్పున పనిచేసి, మూడు రోజుల వీకెండ్ తీసుకోవచ్చు. ఉత్పాదకత తగ్గకుండా ఉద్యోగులకు మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.నిజానికి, ఈ ఆలోచన భారత్‌కు కొత్తేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల్లో వారానికి నాలుగు రోజులు, రోజుకు 12 గంటల చొప్పున పనిచేసే వెసులుబాటును ఐచ్ఛికంగా చేర్చారు. ఇది ఇంకా ఆచరణలోకి రానప్పటికీ, ఫ్లెక్సిబుల్ పనివిధానంపై ఇక్కడ కూడా చర్చ జరుగుతోందని చెప్పడానికి ఇదో సంకేతం. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత్‌లో మూడు రోజుల వీకెండ్ వస్తే ప్రజలు ఆ అదనపు రోజును ఎలా సద్వినియోగం చేసుకుంటారని ఆరా తీయగా