
భారతీయ సినిమా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్ తొలినాళ్ల నాటి కష్టాలను, అప్పటి తన మానసిక సంఘర్షణను అభిమానులతో పంచుకున్నారు.
భవిష్యత్తులో అవకాశాలు వస్తాయో రావో అనే భయంతో ఒకే రోజులో రెండు, మూడు షిఫ్టుల్లో పనిచేసేవాడినని ఆయన తన బ్లాగ్‌లో రాసిన ఓ సుదీర్ఘ పోస్టులో వెల్లడించారు. ఆయన పంచుకున్న ఈ జ్ఞాపకాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఆ రోజుల్లో ఒక సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవడం (ప్రిపరేషన్) అనే పదం తమ తరానికి తెలియదని అమితాబ్ పేర్కొన్నారు. ఆయన మాటల్లోనే.. "మా తరానికి 'ప్రెప్' అనే పదం ఒక కొత్త విషయం. ఇప్పుడు అది సర్వసాధారణమైంది. ఒక పాత్ర కోసం నేటి తరం నటీనటులు పడే కష్టం, వారి శైలి, పాత్ర విశ్లేషణ చూస్తుంటే నాకు ఎంతో గౌరవం కలుగుతుంది. కానీ, మా రోజుల్లో ఒకేసారి 10-15 సినిమాల్లో పనిచేసేవాళ్లం. కొన్నిసార్లు ఒకే రోజు రెండు, మూడు సినిమాల షూటింగ్లలో పాల్గొనేవాళ్లం. అలాంటి పరిస్థితుల్లో ఒక పాత్రకు సిద్ధమై, మళ్లీ వెంటనే మరో పాత్రలోకి మారడం అసాధ్యం. సెట్‌కు వెళ్లాక దర్శకుడు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ వివరిస్తే నటించేసేవాళ్లం" అని తెలిపారు.ఒకే రోజులో వేర్వేరు పాత్రల్లోకి ఎలా మారిపోయేవారని చాలా మంది తనను అడుగుతుంటారని చెబుతూ, అందుకు గల కారణాన్ని హిందీలో వివరించారు. "సోదరా.. అలా చేయకపోతే భవిష్యత్తులో పని దొరుకుతుందో లేదోనని భయం వెంటాడేది. అందుకే, ఏది అడిగితే అది చేసుకుంటూ వెళ్లాను. నెలల తర్వాత సినిమా విడుదలయ్యాక,