
తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు సిద్ధమయ్యారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని.. సాయంత్రం 5 గంటలకు వస్తానని బీఆర్ఎస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు.
హైదరాబాద్, జులై 3: తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు సిద్ధమయ్యారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని.. సాయంత్రం 5 గంటలకు వస్తానని బీఆర్ఎస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. ‘మీరు సిద్ధమైతే ముందే చెప్పండి. నా లెక్కలు తప్పు అయితే రాజీనామా చేస్తా. మీ లెక్కలు తప్పు అయితే రాజీనామా చేస్తారా? మీ లెక్కలు తప్పు అయితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ రాకపోతే జూపల్లి చెప్తున్న లెక్కలు తప్పని మీడియాతో చెప్పమనండి. ఖబడ్దార్.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. పాలమూరు పౌరుషమా? కల్వకుంట్ల పౌరుషమా చూసుకుందాం’ అంటూ ఛాలెంజ్ చేశారు.
‘నేనెక్కడికీ పారిపోలేదు. పారిపోయే లక్షణం నాకు లేదు. నా మాటకు కట్టుబడి ఉన్నాను. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్లాగా కేటీఆర్, హరీశ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అప్పు రూ.3,17,015 కోట్ల అని ఒకసారి, రూ.3,85,045 కోట్లు అని మరోసారి అసెంబ్లీలో కేటీఆర్ అన్నారు. రాష్ట్ర అప్పు రూ.4, 26,499 కోట్లు అని ఒకసారి.. రూ.4,17, 496 కోట్లు అని మరోసారి హరీశ్ అసెంబ్లీలో అన్నారు. కేసీఆర్ దిగిపోయే సరికి రూ.8,21, 651 కోట్ల అప్పు ఉంది. నేను చెప్తున్న లెక్కలు తప్పు అయితే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులను కేటీఆర్, హరీశ్ ఎందుకు చెప్పడం లేదు. మిషన్ భగీరథ కోసం తెచ్చిన అప్పులు ప్రజలు కడతారా?’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అబద్ధాలు చెప్పే వాడిని కాదని మంత్రి తెలిపారు. ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకునే వాడినని తెలిపారు. రాజకీయాల నుంచి వ్యాపారంలోకి రాలేదని.. వ్యాపారం చేసి రాజకీయాల్లోకి వచ్చినట్లు జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు
పొగాకు కొనుగోళ్లలో అక్రమాలను సహించం: మంత్రి అచ్చెన్నాయుడు