తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మానవీయ బంధాలను, సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఆవిష్కరించడంతో మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దిట్ట.
కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, కుటుంబ కథా చిత్రాలకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను మెప్పించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసి సినిమా నిర్మాణంలో ఓనమాలు నేర్చుకున్న నందిని రెడ్డి నాని, నిత్యామీనన్ జంటగా వచ్చిన ‘అలా మొదలైంది’ (2011) చిత్రంతో దర్శకురాలిగా మారి, మొదటి ప్రయత్నంలోనే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ప్రతిష్టాత్మక 'నంది అవార్డు'ను సొంతం చేసుకున్నారు.తొలి సినిమాతోనే టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన నందిని రెడ్డి, ఆ తర్వాత సిద్ధార్థ్, సమంత లతో 'జబర్దస్త్', నాగశౌర్యతో 'కల్యాణ వైభోగమే' చిత్రాలను తెరకెక్కించారు. ఇక కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' ఆధారంగా సమంత ప్రధాన పాత్రలో ఆమె రూపొందించిన ‘ఓ బేబీ’ (2019) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇదే జోష్ లో ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, స్వయంగా నిర్మించిన ‘ మా ఇంటి బంగారం ’ చిత్రానికి కూడా నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా ఆమె పేరు మారుమోగిపోతోంది.* ట్విట్టర్ టాక్: విజువల్స్ అరాచకం.. కథనం వీక్.. 'నాగబంధం' సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? ఇలా కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న నందిని రెడ్డి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, వివాహం, ఒంటరితనంపై సంచలన విషయాలు బయటపెట్టారు. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా సింగిల్ లైఫ్ లీడ్ చేయడంపై ఆమె చాలా ఓపెన్ గా మాట్లాడారు. జీవితంలో పెళ్లి అనేది డూ ఆర్ డై నిబంధన ఏమీ కాదని స్పష్టం చేశారు. తన మెంటాలిటీకి సరిపోయే వ్యక్తి దొరకలేదని, తనకు నచ్చిన వాళ్లతో సింక్ కుదరకపోవడం వల్లే పెళ్లి చేసుకోలేదని, దీనిపై ఇంట్లో వాళ్లు కూడా ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదని తెలిపారు.నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే జీవితంలో ఒంటరితనం వేధించట్లేదా? అనే ప్రశ్నకు ఆమె సమాజం కళ్లు తెరిపించేలా సమాధానమిచ్చారు. "లైఫ్ హ్యాపీగా సాగడానికి కేవలం భార్యాభర్తల బంధం ఒక్కటే మార్గం కాదు. జీవితంలో మన చుట్టూ ఎన్నో బంధాలు ఉంటాయి. నా బరువు బాధ్యతలను, కష్టసుఖాలను పంచుకోవడానికి అద్భుతమైన స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, కొలీగ్స్ ఉన్నారు. నా చుట్టూ నేను ఒక మంచి ప్రపంచాన్ని బిల్డ్ చేసుకున్నాను. నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే, మిగతా అన్నీ ఉన్నాయి. అందుకే నేనెప్పుడూ లోన్లీగా ఫీల్ అవ్వలేదు" అని చాలా బోల్డ్‌గా చెప్పారు.* సత్యదేవ్ 'రావు బహదూర్' ట్విట్టర్ రివ్యూ: సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే? ఆర్థిక ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. తనకు డబ్బు, ఆస్తులు కూడబెట్టడంపై పెద్దగా ఆసక్తి లేదన్నారు. ‘ఓ బేబీ’ అంత పెద్ద హిట్ అయ్యాక కూడా తన బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే ఉన్నాయని, దీంతో తన ఫ్రెండ్ ఒకరు తిట్టి మరీ బలవంతంగా 3 కోట్ల రూపాయల విలువైన ఒక ఫ్లాట్ కొనిపించిందని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఆస్తుల కోసం గొడవలు పడటం కంటే, కొన్ని లక్షలు వదిలేసైనా మనశ్శాంతిని కాపాడుకోవడం మేలనేది తన ఫిలాసఫీ అని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. వీకెండ్స్‌లో ఇంట్లోనే ఉంటూ.. తనకున్న నాలుగు పెట్ డాగ్స్‌తో కాలక్షేపం చేయడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, పుస్తకాలు చదవడం, వంట చేయడమే తన హ్యాపీ లైఫ్ అని, తన మనశ్శాంతికి అడ్డుపడే ఎలాంటి వ్యక్తినైనా, సిట్యుయేషన్ నైనా లైఫ్ నుండి కట్ చేస్తానని నందిని రెడ్డి తేల్చి చెప్పారు.