
Govt Teachers : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా అన్ని సదుపాయాలు అందనున్నాయి.
ఇప్పటివరకు గవర్నెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు మాత్రమే ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం అందుబాటులో ఉండేవి.
ఇప్పటినుంచి లెక్చరర్లు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సెక్రటేరియట్లో నిర్వహించిన ఫస్ట్ పేపర్ లెస్ కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులు పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు ఎప్పటినుంచో మధ్యాహ్న భోజన పథకం అందుబాటులో ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అల్పాహార పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
Read Also : Konda Surekha : ఫస్ట్ పేపర్లెస్ కేబినెట్ భేటీ.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు.. కారణం ఇదే!
ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఇప్పుడు అదే సదుపాయాన్ని టీచర్లకు కూడా వర్తింపజేయాలని కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. గవర్నెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా ప్రతిరోజూ ఫ్రీగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందనుంది.
తద్వారా స్కూళ్లలో సిబ్బంది ఎక్కువ సమయం ఉండటమే కాకుండా విద్యార్థుల చదువుపై కూడా శ్రద్ధ పెట్టేందుకు అవశాశం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.