
విజయవాడ: గాదె సాయికృష్ణ మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు పోలీస్ కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది. ఆయన్ను 8 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నాగరాజును.. రాజమహేంద్రవరం జైలులో విచారించాలని పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సూచించింది. న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డుతో విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.