
'హుకుం... టైగర్ కా హుకుం!' డైలాగ్ మళ్ళీ థియేటర్లలో మోగనుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' రిలీజ్ డేట్ వచ్చేసింది.
ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. 2023లో వచ్చిన 'జైలర్' భారీ విజయం సాధించడంతో, సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ రావడంతో అన్ని భాషల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.