పనీర్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, మసాలాతో కూర చేసి పనీర్ చపాతీ రోల్ చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. సోయా చంక్స్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
ఉడికించిన సోయా చంక్స్‌ను మసాలాలతో వేయించి చపాతీ రోల్స్‌లో ఉంచవచ్చు
ఉడికించిన శనగలను మసాలాలతో కలిపి శనగల చపాతీ రోల్ తయారు చేయవచ్చు. శాకాహారులకు ఇది బెస్ట్ ప్రోటీన్ ఆప్షన్.
టోఫు చపాతీ రోల్ కూడా బాగుంటుంది. వివిధ కూరగాయలతో టోపును కలిపి టేస్టీగా తయారు చేసుకోవచ్చు.
రాజ్మాలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మసాలా రాజ్మాను చపాతీలో చుట్టి తింటే బాగుంటుంది. కడుపు నిండిన ఫీల్ వస్తుంది.
ఆమ్లెట్ వేసి చపాతీలో రోల్ చేసి తినొచ్చు. ఇది టేస్టీగా ఉంటుంది. దీని తయారీ కూడా చాలా సింపుల్.
ఉడికించిన చికెన్ ముక్కలను మసాలాలతో కలిపి చపాతీ రోల్ చేసుకోవచ్చు. ఈ చపాతీ రోల్ తింటే ప్రోటీన్ బాగా అందుతుంది.
మొలకెత్తిన పెసలలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటితో కూడా చపాతీ రోల్స్ తయారు చేయవచ్చు.
చపాతీ రోల్స్ తయారు చేసేటప్పుడు తక్కువ నూనె మాత్రమే వాడండి. తాజా కూరగాయలును ఉపయోగించండి.