
ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. జూన్ నుంచే ముహుర్తాలు షురూ కావడంతో పెళ్లిళ్ల సందడి మొదలైంది. తాజాగా మరో నటుడు పెళ్లీపీటలెక్కారు.
Jul 2 2026 5:37 PM | Updated on Jul 2 2026 5:45 PM
ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. జూన్ నుంచే ముహుర్తాలు షురూ కావడంతో పెళ్లిళ్ల సందడి మొదలైంది. తాజాగా మరో నటుడు పెళ్లీపీటలెక్కారు. తమిళ, మలయాళ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరవింద్ ఆకాశ్ ఓ ఇంటివాడయ్యారు. ఈయన దాదాపు 50 ఏళ్ల వయసులో తన ప్రియురాలు సారాను పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక మలేసియాలోని కౌలాలంపూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
ఈ పెళ్లి వేడుకలో దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు వైభవ్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అరవింద్.. పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కాగా. అరవింద్ ఆకాశ్ కోలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చెన్నై 600028, గోవా, సరోజ, మంకథ, బిర్యానీ, మాస్ ఎంగిర మసిలమణి, చెన్నై 600028 II, మానాడు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల్లో కనిపించారు. అరవింద్ ఎక్కువగా వెంకట్ ప్రభు డైరెక్ట్ మూవీస్‌లో నటించడం విశేషం.
తమిళంతో పాటు మలయాళ చిత్రసీమలోనూ అరవింద్ ఆకాశ్ మెప్పంచారు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'నందనం' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రకు బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మలయాళంలో కూట్టు, వాంటెడ్, వజ్రం, పొన్ముడిపుళయోరతు, మమ్మీ అండ్ మీ, ప్రజాపతి లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే పృథ్వీరాజ్-బాసిల్ జోసెఫ్ నటించిన 'గురువాయూరంబాల నడయిల్' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. కాగా.. అరవింద్ చివరిసారిగా 2024లో విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో నటించారు.
క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్ జగన్ భరోసా (ఫొటోలు)
నాగబంధం ప్రమోషన్స్‌లో హీరోయిన్ నభా నటేష్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు రాజేంద్ర ప్రసాద్,సాయి కుమార్ (ఫొటోలు)
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్‌లో అందాల తునకలు (ఫొటోలు)
ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు.. పవన్ కు బిగ్ షాక్
డెలివరీ బాయ్ ప్రాణం తీసిన పోలీస్ వాహనం ఎలా అంటే
సర్పవరం PS వద్ద ప్రశ్న రావణపై దాడి రంగంలోకి జడ శ్రవణ్
3 పేజీలు కాదు.. 300 పేజీలు రాసుకున్న ఎవరు భయపడరు..
వైరల్ అవుతున్న సియా-చేతన్ కొత్త వీడియో నెట్టింట హల్చల్!