
Chittoor: ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టి బోల్తా పడ్డ కంటైనర్! చిత్తూర్: బెంగుళూరు చెన్నై జాతీయ రహదారి,గంటాఊరు ఫ్లై ఓవర్ దగ్గర గురువారం రోజున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
బెంగళూరు నుండి తిరుపతి వైపు వెళ్తున్న కారును కంటైనర్ ఓవర్టేక్ చేసే క్రమంలో బోల్తా పడింది.
ప్రమాదానికి కంటైనర్ డ్రైవర్ అతివేగంగా నడపడమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణం నష్టం వాటిల్ల లేదు. కంటైనర్ లారీ కారుని కొంత దూరం లాక్కెళ్ళినట్లు స్థానికులు చెప్తున్నారు.
కంటైనర్ డ్రైవర్ మద్యం సేవించాడని అనుమానాల వ్యక్తమవుతున్నాయి. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.