
Government Bank Jobs : బ్యాంకు ఉద్యోగం సాధించాలని కలలుగంటున్న యువతకు సూపర్ ఛాన్స్. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టే కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సెక్టార్ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి సిద్దమయ్యింది… అది ఒకటిరెండు ఉద్యోగాలు కావు ఏకంగా ఆరువేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. కాబట్టి అన్ని అర్హతలుండి బ్యాంకు ఉద్యోగాలపై ఆసక్తి కలిగినవారు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు… ఉద్యోగాన్ని పొంది లైఫ్ లో సెటిల్ కావచ్చు.
సంస్థ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)
పోస్ట్ : ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్మెంట్ ట్రైనీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థులకు కనీసం 20 ఏళ్లు, గరిష్ఠంగా 30 ఏళ్లు ఉండాలి.
ఓబీసీ (OBC) అభ్యర్థులకు : 03 సంవత్సరాలు సడలింపు
దివ్యాంగులకు (PwBD) : 10 సంవత్సరాలు సడలింపు
అభ్యర్థులపై పెద్దగా భారం లేకుండా దరఖాస్తు ఫీజు చాలా తక్కువగా ఉంటుంది
ఇతర కేటగిరీల వారికి (General/OBC/EWS) : రూ. 850
ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
మీ లేటెస్ట్ ఫోటో, సంతకం, ఈమెయిల్ ఐడీ, అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోండి.
మీ కేటగిరీకి అనుగుణంగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, 'Submit' బటన్‌పై క్లిక్ చేయండి.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్‌ను ఒక ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.
అప్లై చేయడానికి చివరి తేదీ: జూలై 21, 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 21, 2026
ఐబిపిఎస్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలో అర్హత సాధించి ఉద్యోగం పొందితే లైఫ్ సెటిల్ అయినట్లే. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం లభిస్తుంది. అంతేకాదు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి… అనుభవం పెరిగేకొద్ది శాలరీ ఇక్రిమెంట్ కూడా ఉంటుంది.