ఏ బంధంలోనైనా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. రోజంతా ఎంత అలసిపోయినా, ఆఫీసులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, లేదా పార్ట్నర్ ప్రవర్తనలో ఏదైనా నచ్చకపోయినా... మీ మనసులోని భావాలను ఒకరితో ఒకరు పంచుకోండి.
విషయాలను మనసులోనే దాచుకోవడం వల్ల దూరం పెరుగుతుందే తప్ప సమస్య తీరదు. మనస్పర్థలు వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోండి. ఒక మంచి భాగస్వామి తన మనసులో మాట చెప్పడమే కాదు, అవతలి వ్యక్తి చెప్పేది కూడా అంతే శ్రద్ధగా వింటారు.
బంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో, గౌరవం కూడా అంతే ముఖ్యం. గౌరవం లేని చోట ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. మీరు ఇద్దరే ఉన్నప్పుడైనా లేదా స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నప్పుడైనా... ఎప్పుడూ ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడటం, ఎగతాళి చేయడం చేయకూడదు. గొడవలు జరిగే సమయంలో కూడా మాటల పరిధి దాటకండి. మీ భాగస్వామి నిర్ణయాల్ని, వారి ఆలోచనల్ని, వారి పనిని మీరు గౌరవించినప్పుడు, వారి మనసులో మీపై ప్రేమ దానంతట అదే రెట్టింపు అవుతుంది.
చాలామంది ప్రేమలో పడ్డాక భాగస్వామికి అస్సలు 'మీ టైమ్' (సొంత సమయం) ఇవ్వరు. ప్రేమ ఎంత ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరికీ ఒక వ్యక్తిగత జీవితం, సొంత గుర్తింపు ఉంటాయని ఆరోగ్యకరమైన బంధం చెప్తుంది. మీ భాగస్వామిని వారి స్నేహితులతో సమయం గడపనివ్వండి, వారి హాబీలను కొనసాగించనివ్వండి. ఇలా కొంత పర్సనల్ స్పేస్ ఇవ్వడం వల్ల బంధంలో దూరం పెరగదు, పైగా కొత్తదనం, ఉత్సాహం పెరుగుతాయి.
మనమంతా మనుషులమే, తప్పులు చేయడం సహజం. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు గొడవలు వస్తుంటాయి. కానీ ఒక మంచి బంధం లక్షణం ఏంటంటే, ఆ గొడవను మీరు ఎంత త్వరగా సర్దుమణిగేలా చేస్తారనేదే. భాగస్వామి చేసిన తప్పును తెలుసుకుని మనస్ఫూర్తిగా సారీ చెప్తే, దాన్ని పెద్ద మనసుతో క్షమించండి. పాత విషయాల్ని మాటిమాటికీ గుర్తు చేస్తూ ఉంటే బంధంలో చేదు పెరుగుతుంది. జరిగిపోయిన దాన్ని వదిలేసి ముందుకు సాగడమే బుద్ధిమంతం.
నమ్మకమే ఏ బంధానికైనా వెన్నెముక లాంటిది. అనుమానం అనేది ఎంతటి బలమైన బంధాన్నైనా లోపల నుండి తొలిచేసే చెదలు లాంటిది. ఎలాంటి బలమైన కారణం లేకుండా భాగస్వామి ఫోన్ చెక్ చేయడం, "ఎక్కడున్నావ్?", "ఎవరితో మాట్లాడుతున్నావ్?" అని పదే పదే ప్రశ్నించడం వల్ల బంధంలో ఊపిరాడనట్లు అనిపిస్తుంది. మీ భాగస్వామిని నమ్మండి, అలాగే వారి నమ్మకాన్ని వమ్ము చేసే ఎలాంటి పనిని మీరు కూడా చేయకండి.
గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.
రచయిత గురించిపుత్తా శ్రీధర్ రెడ్డిశ్రీధర్ రెడ్డి పుత్తా సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2024లో సమయం తెలుగులో చేరిన శ్రీధర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై విస్తృతమైన వార్తల్ని అందించారు. తాను ఈ విభాగాల్లో 1300కి పైగా ఆర్టికల్స్‌ను ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యే సరళమైన భాషలో రాస్తారు. శ్రీధర్ రెడ్డి పుత్తా 2018లో రచనా జర్నలిజం స్కూల్లో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ న్యూస్ ఛానెల్లో (22.10.2018 నుంచి 18.11.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్ వార్తలు రాశారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బులిటెన్‌ను చూసుకునేవారు. ఆ తర్వాత న్యూస్18 తెలుగు వెబ్సైట్లో (30.10.2020 నుంచి 19.09.2024 వరకు) పనిచేశారు. ఈ సమయంలో న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్ వార్తలతో పాటు స్పోర్ట్స్, బిజినెస్, టెక్నాలజీ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి