
‘ఏజెంట్’ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా ఆయన వివరించారు.
Jul 2 2026 2:58 PM | Updated on Jul 2 2026 3:10 PM
‘ఏజెంట్’ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా ఆయన వివరించారు. లెనిల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఏజెంట్ తర్వాత వరసగా సినిమాలు చేయాల్సింది. కానీ ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు ప్రమాదవశాత్తు బాత్రూంలో పడ్డాను. నా చేతికి గాజు ముక్కలు బలంగా గుచ్చుకున్నాయి.
దీంతో ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. మొత్తం 48 కుట్లు పడ్డాయి. 16 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మూడేళ్ల గ్యాప్ వచ్చింది’ అని అఖిల్ వివరణ ఇచ్చాడు. ఇనేళ్లు గ్యాప్ ఇచ్చినందుకు తన అభిమానులు కోపంగా ఉన్నారని.. మరోసారి అలా జరగదని వాళ్లకు నేను హామీ ఇస్తున్నాను అని అఖిల్ అన్నారు. లెనిన్ విషయానికొస్తే.. మురళీ కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. జులై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్ జగన్ భరోసా (ఫొటోలు)
నాగబంధం ప్రమోషన్స్‌లో హీరోయిన్ నభా నటేష్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు రాజేంద్ర ప్రసాద్,సాయి కుమార్ (ఫొటోలు)
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్‌లో అందాల తునకలు (ఫొటోలు)
జనసేన నాయకులు ఓవర్ యాక్షన్.. ప్రశ్న రావణ్ పై కోడిగుడ్లతో దాడి...
నందు లగ్జరీ లైఫ్ వెనుక డార్క్ సీక్రెట్! ఎవరికీ తెలియని నిజాలు ఇవే
ముళ్ల కంపలు.. నీళ్ళు తోడుకోవడం తప్ప అమరావతిలో ఏ ఒక్క పనైనా చేశావా?