
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం రేపు (జులై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ప్రచారాన్ని వేగవంతం చేసింది.అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించగా.. నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు. జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, రిషబ్ సాహ్నీ తదితరులు కీలకపాత్రలు పోషించారు.ఈ సినిమాపై 'బుక్‌మైషో'లో ఇప్పటికే లక్షకు పైగా ఆసక్తులు నమోదయ్యాయని, "రేపటి నుంచి తాండవం మొదలవుతుంది" అని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పురాతన నిధి, నాగసర్పాల నేపథ్యంలో సాగే కథగా పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ప్రధాన పాత్రధారి భారీ దేహంతో, చుట్టూ నాగసర్పాలతో ఉన్న లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేస్తూ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌తో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభమయ్యాయి.