
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా తెగ వైరలవుతుంది. ఆ సినిమా పేరు అనలి. ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పడే తపన, చేసే పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం. థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
'జాన్సి' అనే ఒక సామాన్యమైన మహిళ, ఆమె ఎనిమిదేళ్ల చిన్నారి ఒక ఊహించని ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుంటారు. ఒక భయంకరమైన రాత్రి వేళ ముగ్గురు క్రూరమైన వ్యక్తులు వారిని వేటాడుతుంటారు. ఆ ముగ్గురు హంతకుల బారి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? తన తెలివితేటలు, మనోధైర్యంతో ఆ రాత్రిని ఎలా దాటగలిగింది? అనేదే సినిమా. సింథియా లూర్డే (Cynthia Lourde) ప్రధాన పాత్ర అయిన జాన్సిగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఒకవైపు భయం, మరోవైపు బిడ్డను రక్షించుకోవాలనే పట్టుదలను ఆమె తన నటనతో పండించారు.
నెగెటివ్ పాత్రల్లో కబీర్ దుహాన్ సింగ్, శక్తి వాసు (Shakthi Vasu) తమ నటనతో మెప్పించారు. దినేష్ దేనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా, ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ మంచి వీక్షక ఆదరణను సొంతం చేసుకుంది. హిందీ, తమిళ వెర్షన్లతో పాటు దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది
ఎలాంటి ల్యాగ్ లేకుండా దాదాపు రెండు గంటల పాటు సాగే ఈ ఉత్కంఠభరితమైన యాక్షన్ థ్రిల్లర్‌ను వీక్షకులు ఓటీటీలో చూసేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ వీకెండ్లో ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి 'అనలి' ఒక చక్కని ఎంపిక. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంది. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఓటీటీలో అనలి సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన రోజు నుంచి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఉత్కంఠ, సస్పెన్స్ తో సాగే ఈ సినిమా చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ చిత్రంలోని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, నటీనటుల యాక్టింగ్, అత్యున్నత సాంకేతిక విలువలు సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు.