అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లెనిన్'. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్.. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్.. అక్కినేని ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ ట్రైలర్, అఖిల్ పై ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. 'లెనిన్' ట్రైలర్ పై మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "లెనిన్ ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అఖిల్ అక్కినేని తన పాత్రకు హృదయాన్ని, ఫైర్ ని తీసుకొచ్చారు. ప్రతి ఫ్రేమ్‌లో అతని నటన చూడటం చాలా ముచ్చటగా అనిపించింది. జూలై 10న విడుదల కానున్న ఈ సినిమాతో మొత్తం చిత్ర బృందానికి బిగ్ బ్లాక్ బస్టర్ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని మహేష్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ట్రైలర్ ను షేర్ చేసుకున్నారు.అఖిల్ ఫేవరేట్ హీరో మహేష్ బాబు అనే సంగతి తెలిసిందే. డెబ్యూ మూవీ నుంచే అక్కినేని వారసుడికి మహేష్ తన సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు అఖిల్ కెరీర్ లో కీలకమైన 'లెనిన్' సినిమాకి సూపర్ స్టార్ తన మద్దతు ప్రకటించారు. ట్రైలర్ నచ్చిందని చెబుతూ, అఖిల్ యాక్టింగ్ ను మెచ్చుకున్నారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. ''అన్నా. మీ పోస్ట్ మా ముఖాల్లో పెద్ద చిరునవ్వును తెప్పించింది. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది'' అని అన్నారు.మరోవైపు అఖిల్ బెస్ట్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 'లెనిన్' ట్రైలర్ ను ప్రశంసించారు. ''ట్రైలర్ అద్భుతంగా ఉంది. నా ప్రియమైన సోదరుడు అఖిల్ అదరగొట్టాడు'' అని రామ్ చరణ్ పోస్ట్ పెట్టారు. ''లెనిన్ సినిమాతో అఖిల్ అక్కినేని బిగ్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ అతని శ్రమ, హార్డ్ వర్క్ కనిపిస్తున్నాయి. ఈ జూలై 10న నాగార్జున సార్, నాగ వంశీ ఖచ్చితంగా ఒక విజయాన్ని తమ ఖాతాలో వేసుకోబోతున్నారని నాకు నమ్మకం ఉంది'' అని హీరో నాని పేర్కొన్నారు.''లెనిన్ ట్రైలర్ బ్లాస్ట్ అయిపోయింది. అఖిల్, ఇది నీ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచేలా ఉంది... ఈ పాత్ర కోసమే నువ్వు పుట్టినట్లున్నావు... ఆ ఫైర్, ఆ దృఢ సంకల్పం అన్నీ అద్భుతం. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బ్రదర్. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి శుభాకాంక్షలు'' అని ఎస్.ఎస్ కార్తికేయ పోస్ట్ చేశారు. రామ్ చరణ్, నాని, కార్తికేయ పోస్టులపై అఖిల్ స్పందిస్తూ వారికి థ్యాంక్స్ చెప్పారు. మహాభారతంతో లెనిన్.. అఖిల్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా!రాయలసీమ నేపథ్యంలో లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా ‘లెనిన్’ తెరకెక్కుతోంది. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. మనం ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. జూలై 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.