
ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే, ఎంతటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ తీసుకున్నా కొన్నాళ్లకే బ్యాటరీ త్వరగా అయిపోతోందనే ఫిర్యాదు...
Jul 2 2026 2:06 PM | Updated on Jul 2 2026 2:06 PM
ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే, ఎంతటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ తీసుకున్నా కొన్నాళ్లకే బ్యాటరీ త్వరగా అయిపోతోందనే ఫిర్యాదు సాధారణం. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా హెవీ యూసేజ్ వల్ల ఫోన్లు వేడెక్కడం, చార్జింగ్ నిమిషాల్లో కరిగిపోవడం చాలామందిని వేధించే సమస్య.
స్మార్ట్‌ఫోన్‌ల్లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలకు ఒక నిర్దిష్టమైన లైఫ్ సైకిల్ ఉంటుంది. అయితే, మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ ఆయుష్షు మరింత వేగంగా తగ్గిపోతుంది. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే టెక్ నిపుణులు, మొబైల్ తయారీ సంస్థలు సూచిస్తున్న కొన్ని చిట్కాలు కింద చూద్దాం.
‘100% చార్జింగ్’ రూల్‌కు స్వస్తి చెప్పండి!
చాలామంది ఫోన్ చార్జింగ్ 0% కి పడిపోయే వరకు వాడి, ఆపై 100% అయ్యే వరకు అలాగే వదిలేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. బ్యాటరీని ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయడం, అలాగే పూర్తిగా నింపడం వల్ల దానిపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది.
గోల్డెన్ రూల్: మీ మొబైల్ బ్యాటరీ శాతాన్ని ఎప్పుడూ 20% నుంచి 80% మధ్య ఉంచడానికి ప్రయత్నించండి. చార్జింగ్ 20%కి రాగానే ప్లగ్ ఇన్ చేయడం, 80% - 85% కాగానే తీసేయడం వల్ల బ్యాటరీ లైఫ్ స్థిరంగా ఉంటుంది.
రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చార్జింగ్ పెట్టి ఉదయం తీయడం అలవాటా? ఆధునిక స్మార్ట్ఫోన్లలో చార్జింగ్ 100% కాగానే ఆటోమేటిక్‌గా పవర్ కట్ అయ్యే ‘స్మార్ట్ కట్’ ఫీచర్ ఉన్నప్పటికీ రాత్రంతా ప్లగ్‌లోనే ఉంచడం వల్ల బ్యాటరీ ‘ట్రికిల్ చార్జింగ్’ మోడ్‌లోకి వెళ్తుంది. దీనివల్ల బ్యాటరీ నిరంతరం రసాయన ఒత్తిడికి లోనై కాలక్రమేణా ఉబ్బిపోయే ప్రమాదం ఉంది.
మార్కెట్లో తక్కువ ధరకు దొరికే లోకల్ చార్జర్లు, కేబుల్స్ వాడటం బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. మీ ఫోన్ బాక్స్‌తో పాటు వచ్చిన లేదా సదరు కంపెనీకి చెందిన అధికారిక చార్జర్లను మాత్రమే వాడాలి. లోకల్ చార్జర్లు స్థిరమైన వోల్టేజ్‌ను అందించలేవు.
మొబైల్ బ్యాటరీల ఆయుష్షును తగ్గించే అతిపెద్ద అంశం ఉష్ణోగ్రత. ఫోన్ చార్జింగ్ అవుతున్నప్పుడు సహజంగానే కొంత వేడెక్కుతుంది. ఆ సమయంలో హెవీ గేమింగ్ ఆడటం లేదా యూట్యూబ్ వీడియోలు చూడటం అస్సలు చేయకూడదు. అలాగే, కారు డాష్బోర్డ్లపై, ఎండ తగిలే చోట్ల ఫోన్‌ను ఉంచకూడదు. వీలైతే, చార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ పౌచ్ తీసేయడం మంచిది.
స్క్రీన్ బ్రైట్నెస్ను ఎప్పుడూ ఫుల్‌గా ఉంచకుండా ఆటో బ్రైట్నెస్ మోడ్‌లో పెట్టండి.
మీ ఫోన్లో ఆమోలెడ్ లేదా ఓలెడ్ స్క్రీన్ ఉంటే డార్క్ మోడ్ ఆన్ చేయడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి.
సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫోన్ ఎక్కువ పవర్ వాడుకుంటుంది. కాబట్టి అవసరమైతే కాసేపు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి.
స్మార్ట్‌ఫోన్ అనేది మన నిత్యజీవితంలో భాగం. దాన్ని సరైన పద్ధతిలో చార్జ్ చేయడం, అధిక వేడికి గురికాకుండా చూసుకోవడం ద్వారా బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేకుండానే ఫోన్‌ను కనీసం 3 నుంచి 4 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. కాబట్టి వెంటనే మీ ఫోన్ చార్జింగ్ అలవాట్లను మార్చుకోండి!
ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్!
క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్ జగన్ భరోసా (ఫొటోలు)
నాగబంధం ప్రమోషన్స్‌లో హీరోయిన్ నభా నటేష్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు రాజేంద్ర ప్రసాద్,సాయి కుమార్ (ఫొటోలు)
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్‌లో అందాల తునకలు (ఫొటోలు)
"ఏం తెలుసు అక్క నీకు?".. అనితకు షాకింగ్ కౌంటర్!
పిఠాపురం టూ సర్పవరం.. ఇలా బెయిల్.. అలా అరెస్ట్..