
అసలు పేరు డానియెల్లే ఫాబియోలా నవరెట్టే. కానీ స్వతంత్ర భావాలెక్కువ అని ఆమెకు తల్లి ఇండీ అని ముద్దుపేరు పెట్టారట. అలా ఇండీ నవరెట్టేగానే అందరికీ పరిచయం. పుట్టింది అమెరికాలోని టక్సన్‌లో.
తల్లిది ఆస్ట్రేలియా, తండ్రి మెక్సికన్. ఆయన యూఎస్ మిలిటరీలో పనిచేసేవారు.
పెద్ద పేరున్న నటి కాదు... గతంలో గుర్తుండిపోయే పాత్రలూ చేయలేదు. కానీ ఇప్పుడు ఆమెకి ఎంత క్రేజ్ అంటే... ‘ఆస్కార్ గ్యారెంటీ’ అనేస్తున్నారు. ఇండీ నవరెట్టే... ఇంతకీ ఎవరీమె?
అసలు పేరు డానియెల్లే ఫాబియోలా నవరెట్టే. కానీ స్వతంత్ర భావాలెక్కువ అని ఆమెకు తల్లి ఇండీ అని ముద్దుపేరు పెట్టారట. అలా ఇండీ నవరెట్టేగానే అందరికీ పరిచయం. పుట్టింది అమెరికాలోని టక్సన్‌లో. తల్లిది ఆస్ట్రేలియా, తండ్రి మెక్సికన్. ఆయన యూఎస్ మిలిటరీలో పనిచేసేవారు. దీంతో ఆయనతోపాటు ఊళ్లన్నీ తిరిగారామె. 15 ఏళ్లు వచ్చేసరికి 11 స్కూళ్లు మారారు ఇండీ. ఫ్రెండ్స్ దొరకడం కష్టమయ్యేది కానీ... సర్దుకుపోవడం, భిన్న మనస్తత్వాల్ని తెలుసుకునే వీలు కలిగిందంటారామె. చిన్నవయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో కాలిఫోర్నియాలో అమ్మ దగ్గరే పెరిగారు. అకాడమీ అవార్డుల ఫంక్షన్ జరుగుతోంటే కుటుంబమంతా టీవీ ముందుకు చేరిపోయేదట. తమ అభిమాన నటీనటులకు అవార్డు వస్తుందా అని వాళ్ల నటన గురించి చర్చిస్తోంటే గమనించి, ఆమెకీ ఆసక్తి కలిగింది. అలా నటనవైపు వచ్చారు ఇండీ. తొలిసారి కెమెరా ముందుకొచ్చింది భారతీయ సినిమా ‘క్రాస్ వర్డ్స్ టుగెదర్’తోనే! అదీ 17 ఏళ్ల వయసులో. తరవాత ‘డెంటన్స్ డెత్ డేట్’, ‘వాండర్ డార్క్లీ’, ‘13 రీజన్స్ వై’ వంటివాటిల్లో చేశారు. కాస్తోకూస్తో గుర్తింపు మాత్రం ‘సూపర్‌మ్యాన్ అండ్ లాయిస్’తో వచ్చింది. కానీ అవకాశాలు తక్కువే. తాజాగా ‘అబ్సెషన్’తో ప్రపంచమంతా పరిచయమయ్యారు. నిజానికి ఇది 2024లోనే పూర్తయ్యింది. ప్రజలముందుకు రావడానికే ఇంత సమయం పట్టింది. అయితేనేం సినీ ప్రపంచాన్ని ఆకర్షించింది. పేరున్న తారలు కాదు, దర్శకుడూ పరిచయం లేనివారే మరి. బడ్జెట్ రూ.7కోట్లే. వసూళ్లు మాత్రం రూ.వందలకోట్లు! కేవలం భారత్‌లోనే రూ.77కోట్లకు పైగా రాబట్టింది. దీనిలో ఇండీ నటనకు చాలామంది ఫిదా అయ్యారు. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది.
నిజానికి అబ్సెషన్ షూటింగ్ పూర్తయ్యాక ఇండీకి అవకాశాలే రాలేదు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు. కానీ ఫలితం లేదు. ఇంటి అద్దె కట్టడానికి డబ్బుల్లేక కుక్కల్ని వాకింగ్‌కి తీసుకెళ్లడం, లైవ్ స్ట్రీమింగ్ సహా ఎన్నో పనులు చేశారు. కానీ ఎప్పుడూ నటనని వదిలేయాలి అనుకోలేదట. ‘నచ్చిన దానిలో రాణించాలంటే ఓపిక చాలా కావాలి. అవకాశాలు రానప్పుడు ఇదో పరీక్ష అనుకునేదాన్ని. అయినా నటన నా చిన్ననాటి కల. చిన్న సమస్యలకే ఎలా వదిలేస్తా’ననే పాతికేళ్ల ఇండీ... చిన్న వైఫల్యాలకే వెనకడుగేయొద్దు. ప్రయత్నిస్తూ వెళ్లాలనే చెబుతారు. ఆ తీరే ఇప్పుడు ఆమెకు ఎన్నో అవకాశాలు తెచ్చిపెడుతోంది. అబ్సెషన్లో ‘నిక్కీ’ పాత్రకు ఆస్కార్ గ్యారెంటీ అంటున్నారంతా. ఆమె ప్రయాణానికీ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాబట్టే, ఆమె ఇలానూ నెట్టింట వైరల్ అవుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.